
U19 Asia Cup : క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అండర్-19 ఆసియా కప్ 2025లో హై-వోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏ స్థాయిలో జరిగినా ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. అయితే ఈసారి ఆసక్తిని మరింత పెంచుతున్నాడు 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తన కెప్టెన్ నుంచి వైభవ్‌కు ఒక స్పష్టమైన ఆదేశం అందింది.. “ఏం జరిగినా, నువ్వు సిక్సర్లు కొట్టడం మాత్రం ఆపొద్దు” ఆ మెసేజ్ గురించి వైభవ్ స్వయంగా వెల్లడించాడు.
అండర్-19 ఆసియా కప్ 2025లో తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. యూఏఈతో జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం 95 బంతుల్లోనే ఏకంగా 171 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో అండర్-19 ఆసియా కప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.
యూఏఈపై ఆ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, టీమ్ ఇండియా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే వైభవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సంభాషణలో భాగంగానే కెప్టెన్ ఆయుష్ తనకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాన్ని వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. సిక్సర్లు కొట్టడం మాత్రం ఆపకూడదు అని కెప్టెన్ నాకు చెప్పారు అని వైభవ్ తెలిపాడు. దీనికి వెంటనే ఆయుష్ మ్హాత్రే చమత్కరిస్తూ.. మరి నువ్వు ఎక్కడ కొడుతున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు వైభవ్ అందుకే కదా కెప్టెన్ మాట విని ఉంటే అవుట్ అయ్యేవాడిని కాదు అని సరదాగా బదులిచ్చాడు. పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌లో వైభవ్ కెప్టెన్ ఆదేశాలను పాటిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాలని జట్టు యాజమాన్యం, అభిమానులు ఆశిస్తున్నారు.
పాకిస్తాన్‌తో పోరు గురించి కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, వైభవ్ సూర్యవంశీని అడగగా.. “పాకిస్తాన్‌పై గెలవడమే కాదు, ఈ టోర్నమెంట్ మొత్తంలోనూ అద్భుతంగా ఆడి టైటిల్ గెలవడమే నా లక్ష్యం” అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు. వైభవ్ మాటలను బట్టి ఆయన ఆలోచనలు ఎంత దూరం ఉన్నాయో అర్థమవుతోంది. కేవలం పాకిస్తాన్‌ను ఓడించడం కంటే, భారత్ తరఫున అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను గెలవడమే ఆయన ప్రధాన లక్ష్యం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..