IND vs PAK: షేక్ హ్యాండ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఐసీసీ.. కట్ చేస్తే.. పాక్ ఆటగాళ్లతో చేయి కలపనున్న వైభవ్ సూర్యవంశీ..

ACC Mens U19 Asia Cup 2025, IND vs PAK: అండర్-19 ఆసియా కప్ డిసెంబర్ 12న దుబాయ్‌లో ప్రారంభమవుతుంది. టోర్నమెంట్‌కు ముందు, భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు కరచాలనం చేసుకోవాలని ఐసీసీ సూచించింది. మొత్తం విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs PAK: షేక్ హ్యాండ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఐసీసీ.. కట్ చేస్తే.. పాక్ ఆటగాళ్లతో చేయి కలపనున్న వైభవ్ సూర్యవంశీ..
Vaibhav

Updated on: Dec 11, 2025 | 8:14 PM

ACC Mens U19 Asia Cup 2025: అండర్-19 క్రికెట్ సూపర్ స్టార్లు దుబాయ్ పిచ్‌లపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఎనిమిది ఆసియా జట్లు పాల్గొనే అండర్-19 ఆసియా కప్ డిసెంబర్ 12న ప్రారంభమవుతుంది. టోర్నమెంట్‌కు ముందే, ఐసీసీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సూచనను జారీ చేసింది. భారత వర్సెస్ పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోవాలని ఐసీసీ సూచించింది. అయితే, ఇది జరుగుతుందా లేదా అనే నిర్ణయం టీం ఇండియా ప్రధాన కోచ్, జట్టు మేనేజర్‌కే వదిలేసింది.

అయితే వైభవ్ సూర్యవంశీ పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలుపుతాడా?

టీం ఇండియా ప్రధాన కోచ్ రిషికేశ్ కనిత్కర్, జట్టు మేనేజర్ ఆనంద్ దాతర్. ఈ ఇద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? లేదా అనేది చూడాలి. అయితే, ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఇది అసంభవం. సీనియర్ ఆసియా కప్, మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్తాన్, భారత్ ఆటగాళ్ళు కరచాలనం చేయలేదు. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత ఆటగాళ్ళు కూడా కరచాలనం చేయలేదు.

అండర్-19 ఆసియా కప్ షెడ్యూల్..

అండర్-19 ఆసియా కప్ డిసెంబర్ 12న ప్రారంభమవుతుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ డిసెంబర్ 12న మలేషియాతో కూడా తన తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ డిసెంబర్ 14న దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. భారత జట్టు డిసెంబర్ 16న మలేషియాతో తలపడుతుంది. సెమీ-ఫైనల్స్ డిసెంబర్ 19న, ఫైనల్ డిసెంబర్ 21న జరుగుతాయి.

అండర్ 19 ఆసియా కప్ 2025 షెడ్యూల్..

మ్యాచ్ 1, గ్రూప్ A

జట్లు: ఇండియా vs. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

తేదీ: డిసెంబర్ 12, 2025

వేదిక: దుబాయ్, ఐసీసీ అకాడమీ గ్రౌండ్

మ్యాచ్ 2, గ్రూప్ A

జట్లు: పాకిస్తాన్ vs మలేషియా

తేదీ: డిసెంబర్ 12, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

మ్యాచ్ 3, గ్రూప్ బి

జట్లు: ఆఫ్ఘనిస్తాన్ vs బంగ్లాదేశ్

తేదీ: డిసెంబర్ 13, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్

మ్యాచ్ 4, గ్రూప్ బి

జట్లు: శ్రీలంక vs నేపాల్

తేదీ: డిసెంబర్ 13, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

మ్యాచ్ 5, గ్రూప్ A

జట్లు: ఇండియా vs పాకిస్తాన్

తేదీ: డిసెంబర్ 14, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్

మ్యాచ్ 6, గ్రూప్ A

జట్లు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ vs. మలేషియా

తేదీ: డిసెంబర్ 14, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

మ్యాచ్ 7, గ్రూప్ బి

జట్లు: ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక

తేదీ: డిసెంబర్ 15, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్

మ్యాచ్ 8, గ్రూప్ బి

జట్లు: బంగ్లాదేశ్ vs నేపాల్

తేదీ: డిసెంబర్ 15, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

మ్యాచ్ 9, గ్రూప్ A

జట్లు: పాకిస్తాన్ vs. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

తేదీ: డిసెంబర్ 16, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్

మ్యాచ్ 10, గ్రూప్ A

జట్లు: ఇండియా vs మలేషియా

తేదీ: డిసెంబర్ 16, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

మ్యాచ్ 11, గ్రూప్ బి

జట్లు: బంగ్లాదేశ్ vs శ్రీలంక

తేదీ: డిసెంబర్ 17, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్

మ్యాచ్ 12, గ్రూప్ బి

జట్లు: ఆఫ్ఘనిస్తాన్ vs నేపాల్

తేదీ: డిసెంబర్ 17, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

సెమీ ఫైనల్ 1

జట్లు: A1 vs B2

తేదీ: డిసెంబర్ 19, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్

సెమీ ఫైనల్ 2

జట్లు: B1 vs A2

తేదీ: డిసెంబర్ 19, 2025

వేదిక: దుబాయ్, సెవెన్స్ స్టేడియం

ఫైనల్

జట్లు: TBC vs TBC

తేదీ: డిసెంబర్ 21, 2025

వేదిక: దుబాయ్, ఐసిసి అకాడమీ గ్రౌండ్.