RCB: ఐపీఎల్ 2026కు ముందే ఆర్‌సీబీకి ఎదురుదెబ్బ.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్.. ఎందుకంటే?

Trouble for Yash Dayal, RCB: మైదానంలో వికెట్లు పడగొట్టి హీరోగా మారిన యష్ దయాళ్, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కోర్టులు స్పష్టం చేస్తున్న వేళ, ఈ యువ క్రికెటర్ భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. దీనిపై ఆర్‌సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

RCB: ఐపీఎల్ 2026కు ముందే ఆర్‌సీబీకి ఎదురుదెబ్బ.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్.. ఎందుకంటే?
Rcb Ipl 2026

Updated on: Dec 24, 2025 | 8:26 PM

Trouble for Yash Dayal, RCB: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత 2026 సీజన్ కోసం రూ. 11 కోట్లకు పైగా భారీ ధరతో రిటైన్ అయిన యష్ దయాళ్ ఇప్పుడు తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. జైపూర్‌లోని ఒక మైనర్ బాలిక చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో, బెయిల్ కోసం యష్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జైపూర్ పోక్సో కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

రాజస్థాన్‌కు చెందిన ఒక 17 ఏళ్ల బాలిక యష్ దయాళ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. క్రికెట్ కెరీర్‌లో సహాయం చేస్తానని నమ్మించి, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ గత రెండేళ్లుగా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

యష్ దయాళ్‌పై ఇది రెండో కేసు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడనే ఆరోపణలపై ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 69 కింద కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

జైపూర్ కేసులో బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.

కోర్టులో ఏం జరిగింది?

జైపూర్ కోర్టులో విచారణ సందర్భంగా యష్ దయాళ్ తరపు న్యాయవాదులు.. ఇది తప్పుడు కేసు అని, కక్షపూరితంగానే పెట్టారని వాదించారు. అయితే, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం, బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అంతకుముందు రాజస్థాన్ హైకోర్టు కూడా అతనికి స్టే ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఆర్‌సీబీ, ఐపీఎల్ కెరీర్‌పై ప్రభావం..

యష్ దయాళ్‌పై ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ యాజమాన్యం అతన్ని రిటైన్ చేసుకోవడంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని జట్టులో ఉంచుకోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే లేదా విచారణ వేగవంతమైతే, ఐపీఎల్ 2026 నుంచి యష్ దయాళ్‌ను తప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే యూపీ టీ20 లీగ్ నుంచి అతన్ని నిషేధించినట్లు వార్తలు వచ్చాయి.

మైదానంలో వికెట్లు పడగొట్టి హీరోగా మారిన యష్ దయాళ్, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కోర్టులు స్పష్టం చేస్తున్న వేళ, ఈ యువ క్రికెటర్ భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. దీనిపై ఆర్‌సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..