
Most runs in ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 భారతదేశంలో జరుగుతోంది. 50 ఓవర్ల ఈ టోర్నమెంట్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ప్రారంభమై నవంబర్ 19న అదే వేదికపై ముగుస్తుంది. ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో లీగ్ ఉత్కంఠ దశకు చేరుకుంది. ఈ క్రమంలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు.
ఈ టోర్నమెంట్‌లో పది జట్లు పాల్గొంటున్నాయి. ఇది రౌండ్-రాబిన్ గ్రూప్ స్టేజ్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ జరగనుంది. భారతదేశంలోని 10 వేదికలలో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో ప్రతి జట్టు కనీసం తొమ్మిది మ్యాచ్‌లు, గరిష్టంగా 11 గేమ్‌లు ఆడనున్నాయి.
ఇక బ్యాటర్ల విషయానికి వస్తే.. పరుగుల పరంగా క్వింటన్ డి కాక్ ఆరు మ్యాచ్‌ల్లో 431 పరుగులతో పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ , రచిన్ రవీంద్ర మాత్రమే ఈ ఎడిషన్‌లో 400 పరుగులు దాటారు. ఇక టాప్ 5లో టీమిండియా సారథి రోహిత్ శర్మ చేరాడు.
| బ్యాటర్ | మ్యాచ్‌లు | పరుగులు | సగటు | స్ట్రైక్ రేటు | అత్యధిక స్కోర్ |
| క్వింటన్ డి కాక్ (SA) | 6 | 431 | 71.83 | 117.11 | 174 |
| డేవిడ్ వార్నర్ (AUS) | 6 | 413 | 68.83 | 112.53 | 163 |
| రచిన్ రవీంద (NZ) | 6 | 406 | 81.20 | 107.69 | 123* |
| రోహిత్ శర్మ (IND) | 6 | 393 | 78.60 | 121.67 | 131 |
| ఐడెన్ మార్క్రామ్ (SA) | 6 | 356 | 59.33 | 115.96 | 106 |
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..