ఈ సారైనా గెలిచేనా.. పరువు దక్కేనా? నేడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్..

|

Dec 02, 2020 | 4:54 AM

తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయిన ఇండియా మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటుందా తెలియాలి.

ఈ సారైనా గెలిచేనా.. పరువు దక్కేనా? నేడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్..
Follow us on

India and Australia third ODI: తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయిన ఇండియా మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటుందా తెలియాలి. ఇప్పటికే సరీస్ చేజారినా కనీసం వైట్‌వాష్ నుంచైనా తప్పించుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా ఇంకా టెస్ట్ సిరీస్, టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాల్సి ఉంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోతే జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఈ ఎఫెక్ట్ మిగతా మ్యాచ్‌లపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటికైనా కోహ్లీ టీమ్ కాస్తంతా తేరుకోవాలి. కంగారుల పని పట్టాలి.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియా ఏమాత్రం తగ్గకపోవచ్చు. అదే జోరు కొనసాగించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అయితే వార్నర్ గాయంతో ఈ మ్యాచ్‌కి దూరం కావడం ఇండియాకి కలిసొచ్చే విషయం. ఇతడి స్థానంలో వేడ్ లేదా డార్సీ షార్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బౌలింగ్‌లో హేజిల్‌వుడ్, జంపాలను సమర్థవంతంగా ఎదుర్కొవాలి. ఇక ఇండియా టీంకు వస్తే గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఫాస్ట్ బౌలర్ సైని, లెగ్ స్పిన్నర్ చాహల్‌ను పక్కన పెట్టాల్సిందే. అలాగే నటరాజన్‌ను టీంలోకి తీసుకురావాలని ఒత్తిడి పెరుగుతోంది. ఇక బుమ్రా కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. షమి ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నా మరో దాంట్లో చేతులెత్తేశాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ విషయంలో విమర్శలు ఎదర్కొంటున్న విరాట్ ఏం చేస్తాడో చూడాలి. కంగారుల ఎదుట భారీ లక్ష్యాన్ని నిలపాలంటే కచ్చితంగా విరాట్ విజృంభించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.