టెస్ట్‌లకు పనికిరాడని తేల్చారు.. కట్‌ చేస్తే.. ఇంగ్లండ్‌ గడ్డపై 11 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ బాదిన తెలుగోడు

Tilak Varma: ఇంగ్లాండ్‌తో జరుగుతున్నలీడ్స్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 5 సెంచరీలు సాధించారు. ఇప్పుడు మరో భారతీయ ఆటగాడు ఇంగ్లాండ్‌లో సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ ఆటగాడు తన జట్టు తరపున తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ యువ తెలుగు ఆటగాడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

టెస్ట్‌లకు పనికిరాడని తేల్చారు.. కట్‌ చేస్తే.. ఇంగ్లండ్‌ గడ్డపై 11 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ బాదిన తెలుగోడు
Tilak Varma

Updated on: Jun 24, 2025 | 5:24 PM

Tilak Varma: ఇంగ్లాండ్‌లో భారత ఆటగాళ్లు ఆరో సెంచరీ సాధించారు. ఇప్పటికే.. ఐదు సెంచరీలు కొట్టారు. లీడ్స్‌ టెస్టులో భారత్‌ బ్యాటింగ్‌ ముగిసింది. మరి ఆరో సెంచరీ ఎక్కడి నుంచి వచ్చింది. మరి ఇప్పుడు మరో భారత ఆటగాడు సెంచరీ ఎలా చేశాడు అని ఆలోచిస్తున్నారా? టెస్ట్ జట్టులో లేని ఓ యువ ఆటగాడు ఇంగ్లీష్‌ గడ్డపై సెంచరీతో సెలక్టర్లకు సవాలు విసిరాడు. అదెక్కడో ఇప్పుడు చూద్దాం..

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లీడ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా నుంచి మొత్తం 5 సెంచరీలు నమోదయ్యాయి. అదే సమయంలో.. మరో భారత బ్యాట్స్‌మన్ ఇంగ్లాండ్‌లో సెంచరీతో రెచ్చిపోయాడు. ఆ ప్లేయర్‌ ఎవరో కాదు.. మన తెలుగోడు తిలక్‌ వర్మ. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాలో తిలక్‌ భాగం కాదు. టెస్టులకు పనికిరాడని సెలక్టర్లు పక్కన పెట్టారు. అందుకే తన సత్తా చాటేందుకు ఇదే సరైన సమయం అనుకుని.. వీరోచిత ఇన్నింగ్స్‌తో సెలక్టర్లకు సవాలు విసిరాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తిలక్‌ ఈ ఘనత సాధించాడు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ భారత ఆటగాడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ ఇన్నింగ్స్ ఆడటం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Virushka: ఆ విషయంలో నేనే ఫస్ట్.. విరాట్‌ కోహ్లీకి ఇచ్చిపడేసిన అనుష్క

తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన భారత ఆటగాడు

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో.. భారత వర్ధమాన స్టార్ క్రికెటర్‌ తిలక్ వర్మ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. హాంప్‌షైర్ తరపున ఆడుతున్న తిలక్ ఎసెక్స్‌తో జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరితో చెలరేగాడు. ఈ 22 ఏళ్ల యువ బ్యాటర్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఇంగ్లాండ్‌కు రావడం కూడా ఇదే మొదటిసారి. తన తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లీష్‌ గడ్డపై ఇలాంటి మాస్టర్‌ ఇన్నింగ్స్‌ ఆడటం అతడి కెరీర్‌కే ప్లస్‌.

తిలక్ వర్మ ఈ ఇన్నింగ్స్‌ను కీలక సమయంలో ఆడాడు. అతను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి.. హాంప్‌షైర్‌ జట్టు 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్‌ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఏమాత్రం తడబడకుండా భారీ షాట్లు ఆడుతూ.. జట్టుకు మంచి స్కోరు అందిస్తున్నాడు. 100 పరుగుల మార్కును చేరుకోవడానికి అతను 239 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తిలక్ 11 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.

ఇది కూడా చదవండి: సచిన్, గంగూలీ చేయలేనిది.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో ఐపీఎల్ బుడ్డోడి వీరంగం.. ఇక ఇంగ్లండ్‌కు దబిడ దిబిడే

కౌంటీ క్రికెట్‌కు ప్రయోజనం..

తిలక్ వర్మ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడటం భారత క్రికెట్‌కు సానుకూల సంకేతం. కౌంటీ క్రికెట్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు కఠినమైన సవాలుగా పరిగణించబడుతుంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్ స్వింగ్, సీమ్ కదలిక కారణంగా వారి టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవాలి. ఈ అనుభవం తిలక్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అతని బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడానికి మంచి అవకాశమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో దేశం తరపున ఆడటానికి మంచి ప్రాక్టీస్‌లా కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..