ODI World Cup 2023: తిలక్ వర్మ వంటి ప్రతిభావంతుడైన నమ్మకం చూపాలని, వన్డే ప్రపంచకప్ జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను చేర్చాలని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జాతీయ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరారు. ఎందుకంటే అతను బహుళ మిడిల్ ఆర్డర్ కష్టాలకు సమాధానంగా ఉంటాడని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్లు గాయాల నుంచి కోలుకుంటున్నారని పేర్కొన్నాడు.
అశ్విన్ వ్యాఖ్యలను సెలెక్టర్ల మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ కూడా సమర్థించారు. ఈమేరకు తిలక్ వర్మను స్వ్కాడ్ 15 మందిలో చూడడానికి ఇష్టపడుతుంటాడు. శ్రేయాస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకోకపోతే, తిలక్ వర్మ్ బెస్ట్ ఆఫ్షన్ అని పేర్కొన్నాడు.
20 ఏళ్ల స్టైలిష్ హైదరాబాద్ ఎడమచేతి వాటం ఆటగాడు వెస్టిండీస్‌లో జరిగిన మూడు T20Iలలో 39, 50, 49 నాటౌట్ స్కోర్‌లతో అందరినీ ఆకట్టుకున్నాడు.
“ఇది ప్రపంచ కప్‌నకు సంబంధించిన సమయం. కాబట్టి, మనకు తగినంత బ్యాకప్‌లు లేకపోతే కష్టం అవుతుంది. తిలక్ వర్మ గురించి ఒక ఎంపికగా ఆలోచింవచ్చు. సంజూ శాంసన్ వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. కానీ, తిలక్ వర్మ గురించి ఉత్తేజకరమైన భాగం ఏమిటంటే అతను ఎడమ చేతి వాటం. టీమ్ ఇండియాకు ఎడమచేతి వాటం ఆటగాళ్ల కొరత ఉంది. టాప్ 7లో ఉన్న ఏకైక ఎడమచేతి వాటం బ్యాటర్ రవీంద్ర జడేజా అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే 50 ఓవర్లలో స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, అయ్యర్ ఫిట్‌నెట్‌ను పొందేందుకు కష్టపడుతున్నారు. రెండు బ్యాకప్ ఎంపికలుగా సూర్యకుమార్ యాదవ్, శాంసన్‌లు బెస్ట్ ఆఫ్షన్‌లుగా మారారు. నం. 4 స్లాట్‌కు సంబంధించి తికమక పెట్టే సమస్య కొనసాగుతోంది.
సూర్య జట్టు మేనేజ్‌మెంట్ విశ్వాసాన్ని చూరగొంటూ, జట్టులో అదనపు మిడిల్ ఆర్డర్ ఎంపికగా ఉంటాడు. శాంసన్ అతని అవకాశాలను పొందడంలో విఫలమయ్యాడు. రాహుల్ ఫిట్‌గా ఉంటే, ఇషాన్ కిషన్ బ్యాకప్ కీపర్-కమ్-రిజర్వ్ ఓపెనర్‌గా ఉండవచ్చు.
“హైదరాబాద్‌లో అతని లిస్ట్ ఏ రికార్డు చూస్తే.. తిలక్ వర్మ 25 లిస్ట్ A గేమ్‌లను ఆడాడు. సగటు 55 ప్లస్ (56.18) కలిగి ఉన్నాడు. ఐదు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు. అంటే కనీసం 50 శాతం సార్లు అతను యాభైలను వందలుగా మారుస్తున్నాడు. స్ట్రైక్ రేట్ 100 ప్లస్‌గా ఉంది”. దీంతో తిలక్ వర్మను వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడించాలని మాజీలు, ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..