
Tilak Varma Century vs Pakistan: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్-A చేతిలో భారత్-A 48 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. నవంబర్ 22న జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 313 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో భారత్ 265 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమికి కెప్టెన్ తిలక్ వర్మ నెమ్మదైన బ్యాటింగే కారణమని మాజీ భారత బ్యాటర్ సంజయ్ బంగర్ తీవ్ర విమర్శలు చేశారు. సోనీ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 313 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో తిలక్ వర్మ 149 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఇది వరుసగా అతడికి రెండో సెంచరీ. ఇంతకుముందు నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు.
సెంచరీ చేసినా తిలక్ స్ట్రైక్ రేట్ 67.11 మాత్రమే ఉండటం వివాదాస్పదమైంది. 148 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీనిపైనే బంగర్ మండిపడ్డాడు.
“తిలక్ తొలి 25 బంతుల్లో కేవలం 2-3 పరుగులు మాత్రమే చేశాడు, తొలి 50 బంతుల్లో 21 పరుగులే చేశాడు. ఇది అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అతడు ఆలోచించాలి. దీంతో వారు రిస్క్ చేయాల్సి వచ్చి వికెట్లు పారేసుకున్నారు” అని బంగర్ పేర్కొన్నారు.
అయితే ఈ విమర్శలపై తిలక్ వర్మ భిన్నంగా స్పందించాడు. ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ భాగస్వామ్యాలు లేకపోవడమే ఓటమికి కారణమని అన్నాడు.
“అభిషేక్ ఆరంభం, మధ్యలో షాబాజ్‌తో నా భాగస్వామ్యం కీలకం. కానీ మేము వేగం పెంచాలనుకున్న సమయంలో షాబాజ్ ఔటయ్యాడు. మరో రెండు ఓవర్లు ఉండి ఉంటే నేను మ్యాచ్ ఫినిష్ చేసేవాడిని” అని తిలక్ చెప్పాడు. దీంతో సెంచరీ హీరో వర్సెస్ స్లో బ్యాటింగ్ విలన్ అనే చర్చ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..