Ind Vs Pak: భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‎పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. తమ చేతుల్లో ఏమి లేదన్న దాదా..

|

Nov 16, 2021 | 8:24 AM

భారత్‎లో క్రికెట్‎ను ఒక మతంలా చూస్తారు. దాదాపు అందరు క్రికెట్‎ను ఇష్టపడతారు. ముఖ్యంగా ఇండియా, పాక్ మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోతారు. టీ20 వరల్డ్ కప్‎లో ఇండియా, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‎ను కోట్ల మంది వీక్షించారు...

Ind Vs Pak: భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‎పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. తమ చేతుల్లో ఏమి లేదన్న దాదా..
Ind Vs Pak
Follow us on

భారత్‎లో క్రికెట్‎ను ఒక మతంలా చూస్తారు. దాదాపు అందరు క్రికెట్‎ను ఇష్టపడతారు. ముఖ్యంగా ఇండియా, పాక్ మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోతారు. టీ20 వరల్డ్ కప్‎లో ఇండియా, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‎ను కోట్ల మంది వీక్షించారు. భారత్, పాక్ మ్యాచ్ అంటే అంత క్రేజ్ ఉంటుంది మరి. అయితే కేవలం వరల్డ్ కప్ మ్యాచ్‎ల్లోనే ఇరుజట్లు తలపడుతున్నాయి తప్ప ద్వైపాక్షిక సిరీస్‎లు జరగడం లేదు. చివరిసారిగా 2012-13లో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తమైన దౌత్య సంబంధాలతో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‎లను నిలివేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న వేళ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

40వ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో పుస్తకావిష్కరణలో పాల్గొన్న గంగూలీ ” ఇండియా, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ బోర్డుల చేతుల్లో లేదు. ప్రపంచ టోర్నమెంట్‌లలో రెండు జట్లు తలపడుతున్నాయి. ద్వైపాక్షిక క్రికెట్ సంవత్సరాలుగా నిలిపిచిపోయింది. దీనిపై సంబంధిత ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది. ఇది రమీజ్ చేతుల్లో కానీ, నా చేతుల్లో కానీ లేదు” అని అన్నారు. ఏసీసీ సమావేశాల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షాతో సమావేశమయ్యారు. గతంలో గంగూలీతో చర్చలు జరిపినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా తెలిపారు. రాజకీయాలను క్రీడలకు దూరంగా ఉంచాలని రాజా కోరారు. “మనం క్రికెట్ బంధాన్ని ఏర్పరచుకోవాలి, అయితే రాజకీయాలు క్రీడలకు వీలైనంత దూరంగా ఉండాలని నేను నమ్ముతున్నాను ఇది ఎల్లప్పుడూ మా వైఖరి” అని రాజా అన్నారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తనదైన ముద్ర వేస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ టీం ఇండియా ప్రధాన కోచ్‎గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వీవీఎస్ లక్ష్మణ్‎ను ఎన్‎సీఏ హెడ్‎గా ఉండేందుకు ఒప్పించాడు. ఇలా చాలా పనులు చేస్తున్నాడు. దాదా తలుచుకుంటే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

Read Also.. Chahal: టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో నిరాశకు గురయ్యాను.. రోహిత్‎తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది..