T20 World Cup: ఓపెనర్లపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ.. వారిద్దరే ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వెల్లడి..

|

Oct 19, 2021 | 10:53 AM

టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ 24న పాకిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎కు పెద్ద సందేహం తలెత్తింది. అదేమిటంటే టాప్ ఆర్డర్ ఎలా ఉంటుందని. రోహిత్ శర్మ ఒక ఓపెనర్‎గా వస్తాడని తెలుసు కానీ మరో ఓపెనర్ ఎవరు అని క్రికెట్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. రెండో ఓపెనర్ కోసం ప్రధాన పోటీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, KL రాహుల్ మధ్య ఉంది...

T20 World Cup: ఓపెనర్లపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ.. వారిద్దరే ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వెల్లడి..
Virat Kohli
Follow us on

టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ 24న పాకిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎కు పెద్ద సందేహం తలెత్తింది. అదేమిటంటే టాప్ ఆర్డర్ ఎలా ఉంటుందని. రోహిత్ శర్మ ఒక ఓపెనర్‎గా వస్తాడని తెలుసు కానీ మరో ఓపెనర్ ఎవరు అని క్రికెట్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. రెండో ఓపెనర్ కోసం ప్రధాన పోటీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, KL రాహుల్ మధ్య ఉంది. జట్టులో శిఖర్ ధావన్ లేనందున రోహిత్ తన ప్రారంభ భాగస్వామిగా కోహ్లీని ఎన్నుకుంటాడని, రాహుల్ మూడో స్థానంలో వస్తాడని అనుకుంటున్నారు. అయితే దుబాయ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన భారత తొలి వార్మప్ గేమ్ టాస్‌ సమయంలో ఈ విషయమై కోహ్లీ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్ 2021లో జరిగిన తర్వాత తమ ప్రణాళికలో మార్పు వచ్చింది. “ఐపీఎల్ కంటే ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవి, ఇప్పుడు కెఎల్ రాహుల్‌ ఫామ్‎లో ఉన్నాడు. రోహిత్, రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. తను మూడో స్థానంలో బ్యాటింగ్‎కు వస్తానని కోహ్లీ చెప్పాడు.

మార్చిలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన హోమ్ సిరీస్‌లో కోహ్లీ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 626 పరుగులతో రాణించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానంలో నిలిచాడు. టోర్నమెంట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ పరంగా తాను ఎక్కువ ఆలోచిస్తున్నామని, “ఇప్పుడు ఈ జట్టుకు త్వరగా అలవాటు పడటంతోపాటు ఎవరు ఎక్కడ ఆడుతారు అనేది ముఖ్యం. ఆటలలో అబ్బాయిలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాం ” విరాట్ చెప్పారు. సోమవారం తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

Read Also.. Virat Kohli: విరాట్‎కు అరుదైన ఘనత.. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం ఆవిష్కరణ..