వన్డే కెరీర్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టని ‘బోరింగ్ ప్లేయర్స్’.. లిస్టులో టీమిండియా బ్యాటర్ కూడా..

| Edited By: Ram Naramaneni

Nov 24, 2022 | 7:40 PM

ఇన్నింగ్స్ మొత్తం ముగిసినా బంతిని సిక్స్ బౌండరీ లైన్‌పైకి పంపని బ్యాటర్లను మీరెప్పుడైనా చూశారా. ఇలాంటి ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. భారత్‌తో సహా ప్రపంచంలో ఇలాంటి ఆటగాళ్ళు కనిపిస్తారు.

వన్డే కెరీర్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టని బోరింగ్ ప్లేయర్స్.. లిస్టులో టీమిండియా బ్యాటర్ కూడా..
Odi Cricket
Follow us on

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ఎందరో బ్యాటర్లు కనిపిస్తుంటారు. ఇందులో కొంతమంది ఆటగాళ్ళు వేగంగా బ్యాట్ ఝలిపిస్తే.. మరికొంతమంది ఆటగాళ్లు మాత్రం తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆడేస్తుంటారు. ఇందులో చాలామంది ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్‌లో టెక్నిక్ సహాయంతో మాత్రమే ఆడుతూ హాఫ్ సెంచరీలు, సెంచరీలు స్కోర్ చేస్తారు. ప్రతి క్రీడాకారుడు అలాంటి దూకుడు లేదా రక్షణాత్మక శైలితో తన స్వంత గుర్తింపును కలిగి ఉంటాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వివిధ సందర్భాల్లో, బ్యాడ్ బాల్ కోసం ఎదురుచూసి, గాలిలో షాట్‌లు ఆడకుండా ఉండే ఆటగాళ్లను చాలా మంది చూసే ఉంటారు. ఇన్నింగ్స్ మొత్తం ముగిసినా బంతిని సిక్స్ బౌండరీ లైన్‌పైకి పంపని బ్యాటర్లను మీరెప్పుడైనా చూశారా. ఇలాంటి ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. భారత్‌తో సహా ప్రపంచంలో ఇలాంటి ఆటగాళ్ళు కనిపిస్తారు. తమ కెరీర్‌లో సిక్సర్ కొట్టని ఆటగాళ్లు కొందరు ఉన్నారు. ఈ కథనంలో తమ వన్డే కెరీర్‌లో ఎప్పుడూ సిక్స్ కొట్టని ప్రపంచ క్రికెట్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..

డియోన్ ఇబ్రహీం..

జింబాబ్వే నుంచి వచ్చిన ఈ ఆటగాడు తన వన్డే కెరీర్‌లో ఎప్పుడూ సిక్సర్ కొట్టలేదు. విశేషమేమిటంటే వన్డేలతోపాటు టెస్టు క్రికెట్‌లో కూడా అతను ఆరు పరుగుల కోసం బంతిని బౌండరీ లైన్ వెలుపలికి పంపలేదు. ఈ ఆటగాడు 82 వన్డేలు ఆడాడు. ఇది కాకుండా ఇబ్రహీం తన కెరీర్‌లో 29 టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డే క్రికెట్‌లో అతనికి ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా, అతను టెస్టుల్లో పది అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ, ఒక్కసారి కూడా బంతిని సిక్స్ పంపలేదు. కెరీర్‌లో సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు సాధించిన ఈ ఆటగాడు రెండు ఫార్మాట్‌లలో కూడా సిక్సర్ కొట్టలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందికదా.

ఇవి కూడా చదవండి

థిలాన్ సమరవీర..

శ్రీలంక తరపున నిలకడగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఈ ఆటగాడు ఉన్నాడు. టెస్టు కెరీర్‌లో సిక్స్ కొట్టిన ఈ ఆటగాడు ODI కెరీర్‌లో మాత్రం 53 మ్యాచ్‌లు ఆడినా బంతిని బౌండరీ లైన్ దాటించలేకపోయాడు. వన్డేలో రెండు సెంచరీలు సాధించాడు. కానీ, ఒక్కసారి కూడా సిక్స్ కొట్టలేకపోయాడు.

మనోజ్ ప్రభాకర్..

మనోజ్ ప్రభాకర్ ఆల్ రౌండర్‌గా భారత జట్టు తరపున ఆడాడు. 12 ఏళ్ల కెరీర్‌లో అతను భారతదేశం తరపున 130 ODIల్లో కనిపించాడు. రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ, తన వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా సిక్సర్ కొట్టలేకపోయాడు. ఇన్ని మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి కూడా సిక్సర్ కొట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..