IPL 2023: ఆ ముగ్గురే ధోనికి యమా డేంజర్.. త్వరగా పెవిలియన్ చేరకపోతే ఇంటికే.. వారెవరంటే.?

|

May 29, 2023 | 9:42 AM

వర్షం కారణంగా మే 28న(ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్.. మే 29(సోమవారం)కి వాయిదా పడింది.

IPL 2023: ఆ ముగ్గురే ధోనికి యమా డేంజర్.. త్వరగా పెవిలియన్ చేరకపోతే ఇంటికే.. వారెవరంటే.?
Csk Team
Follow us on

వర్షం కారణంగా మే 28న(ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్.. మే 29(సోమవారం)కి వాయిదా పడింది. ఇక ఈ రోజు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితేనేం ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నైకి.. గుజరాత్ టైటాన్స్ గట్టిపోటీని ఇవ్వనుంది. ఇక ధోనిసేన ఐదోసారి కప్ గెలుచుకోవాలంటే.. గుజరాత్ ప్రధాన బ్యాటర్లైన ముగ్గురిని త్వరగా పెవిలియన్‌కు పంపాల్సి ఉంటుంది.

గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్లు చెన్నైకి చాలా కీలకం కానున్నాయి. చెన్నై గెలవాలంటే ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న అతడు.. మూడు సెంచరీల సాయంతో 851 పరుగులు చేశాడు. అలాగే మిడిలార్డర్‌లో వచ్చే డేవిడ్ మిల్లర్‌ కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్ధుడు. హార్దిక్ పాండ్యా కూడా అంతే.! అటు చెన్నై బ్యాటింగ్ కూడా తక్కువేం కాదు.. ఎనిమిదో నంబర్‌ వరకు అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. ఇక ఫినిషర్ స్థానంలో ధోని చివర్లో దుమ్ములేపుతున్నారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి.. రెండు జట్లలోనూ బ్యాటర్లు కీలకంగా మారనున్నారు.