World Cup 2023: ఆందోళనలో పాకిస్తాన్ జట్టు.. కన్‌ఫాం కానీ వీసాలు.. కట్‌చేస్తే.. బెడిసికొట్టిన దుబాయ్ స్కెచ్.. ఎందుకంటే?

|

Sep 24, 2023 | 7:53 AM

Pakistan Cricket Team: సెప్టెంబరు 29న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగే వార్మప్ గేమ్‌కు ముందు జట్టు దుబాయ్‌లో రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం వీసా సమస్యలతో ఆ జట్టు ప్లాన్స్ ఫలించలేదు. వీసాలు క్లియరెన్స్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, మార్క్యూ ఈవెంట్‌లో పాల్గొనేందుకు, సకాలంలో అందుకుంటామని ఆశిస్తున్నట్లు పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్) లోని ఉన్నత వర్గాలు ధృవీకరించాయి.

World Cup 2023: ఆందోళనలో పాకిస్తాన్ జట్టు.. కన్‌ఫాం కానీ వీసాలు.. కట్‌చేస్తే.. బెడిసికొట్టిన దుబాయ్ స్కెచ్.. ఎందుకంటే?
Pakistan Cricket Team
Follow us on

Pakistan Cricket Team: ఐసీసీ ప్రపంచకప్‌ కోసం భారత్‌కు రానున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇంకా వీసాలు అందలేదు. దీంతో ప్రస్తుతం ఆ జట్టుకు ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పీసీబీ జట్టులోకి ఓ అధికారి మాట్లాడుతూ.. “మేం ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌తో సహా 33 వీసాల కోసం దరఖాస్తు చేశాం. కానీ, ఇప్పటివరకు మాకు ఎటువంటి నిర్ధారణ రాలేదు. మేం మొదట దుబాయ్‌లో రెండు రోజుల సెషన్‌ని ప్లాన్ చేశాం. కానీ అది జరగలేదు”అని తెలిపారు.

పాకిస్తాన్ ఇప్పుడు లాహోర్ నుంచి తెల్లవారుజామున విమానంలో బయలుదేరుతుందని, సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుందని స్పోర్ట్స్‌స్టార్ పేర్కొంది. వీసా సమస్య పాకిస్తాన్ ప్రపంచ కప్ సన్నాహాలకు అంతరాయం కలిగించింది. ఎందుకంటే, బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు దుబాయ్‌లో ముందుగా అనుకున్న శిక్షణను కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబరు 29న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగే వార్మప్ గేమ్‌కు ముందు జట్టు దుబాయ్‌లో రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం వీసా సమస్యలతో ఆ జట్టు ప్లాన్స్ ఫలించలేదు.

వీసాలు క్లియరెన్స్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, మార్క్యూ ఈవెంట్‌లో పాల్గొనేందుకు, సకాలంలో అందుకుంటామని ఆశిస్తున్నట్లు పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్) లోని ఉన్నత వర్గాలు ధృవీకరించాయి.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు:

పాకిస్తాన్ చివరిసారిగా 2016లో భారత్‌లో ఆడింది. అనంతరం రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2013 నుంచి ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్), ACC (ఆసియా క్రికెట్ కౌన్సిల్) ఈవెంట్‌లలో ఇరుజట్లు తలపడుతున్నాయి.

పాక్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లో ప్రేక్షకులు లేకుండానే న్యూజిలాండ్‌తో తన మొదటి వార్మప్ గేమ్ ఆడుతుంది. దాని తదుపరి వార్మప్ మ్యాచ్‌లో అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

వన్డే ప్రపంచ కప్ బరిలోకి దిగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు

వన్డే ప్రపంచకప్ ట్రోఫీ

పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు:

బాబర్ అజామ్ (కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిమ్, హసన్ అలీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..