Surrey County Cricket Club :క్రికెట్ లో ప్రస్తుతం పరిమిత ఓవర్ల సీజన్ నడుస్తోంది. బ్యాటింగ్ లో వేగంగా పరుగులు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకే టెస్టులపై ఆసక్తి తగ్గిపోతోంది. ఫోర్లు, సిక్సర్లు, తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు, శతకాలు దంచాలని బ్యాట్స్‌మెన్లతోపాటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇలా కొంతమంది మాత్రమే పరుగుల వరద పారించగలరు. అయితే, కొంతమంది మాత్రం మ్యాచ్ గమనాన్ని బట్టి ఆడుతూ, డ్రా చేసుకునేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి బ్యాట్స్‌మెన్స్‌లో దక్షిణాఫ్రికా మాజీ లెజెండ్ హషీమ్ ఆమ్లా ముందుంటాడు. ఆమ్లా రెండు ఫార్మాట్లలో బాగానే బ్యాటింగ్ చేస్తాడనే పేరున్నా.. ఎన్నో రికార్డులు కలిగి ఉన్నా.. టెస్టులు లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికి వస్తే మాత్రం.. నిరాశ పడాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆమ్లా.. ఇంగ్లండ్‌లో ఓ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులతోపాటు బౌలర్లను అలసిపోయేలా చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో సర్రే, హాంప్ షైర్ టీంల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో హాంప్ షైర్ 488 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సర్రే టీం కేవలం 72 పరుగులు మాత్రమే చేయగలిగింది. సర్రే ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో సర్రే టీం కచ్చితంగా ఓడిపోతారు. కానీ, చివరి రోజు, హషిమ్ ఆమ్లా.. తన విశ్వరూపాన్ని చూపడంతో.. బౌలర్లు అలసిపోయారు. పరుగులు చేయకుండా క్రీజులో పాతుకపోయాడు. ఆరోజు పూర్తికావాల్సిన ఓవర్లపై మాత్రమే ఫోకస్ చేసిన ఆమ్లా.. బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
హషీమ్ ఆమ్లా మారథాన్ ఇన్నింగ్స్..
టెస్టు క్రికెట్‌లో తన ల్యాగ్ ఇన్నింగ్స్‌కు పేరుగాంచిన ఆమ్లా.. ఈ మ్యాచ్‌లో తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రుద్దేశాడు. సర్రే టీం కేవలం 9 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరకపోయింది. ఈ స్థితిలో బ్యాటింగ్ వచ్చిన ఆమ్లా.. ఫెవికిక్‌లా క్రీజులో పాతుకపోయాడు. హాంప్ షైర్ టీంలోని ప్రతీ బౌలర్.. ఆమ్లాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలన్నీన విఫలం అయ్యాయి. రోజంతా బ్యాటింగ్ చేసిన ఆమ్లా.. 278 బంతుల్లో కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం ఎలా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్‌ను కాపాడడంలో సఫలం అయ్యాడు.
104 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే
సర్రే టీంలో మిగతా బ్యాట్స్‌మెన్లు ఆమ్లాను ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. 104.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సర్రే టీం ఆటగాళ్లు.. కేవలం 122 పరుగులు మాత్రమే సాధఇంచారు. ఇందులో 62 ఓవర్లు మెయిడిన్‌లుగా ఉన్నాయి.
Also Read:
India vs Srilanka: యువ ఆటగాళ్లకు కీలకం.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటుతోన్న ప్లేయర్స్!
MS Dhoni – CSK: సీఎస్కే ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా మహేంద్రుడే..!