Ritika sajdeh-Anushka Sharma, WTC 2023 Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య టైటిల్ పోరు కొనసాగుతోంది. ఫైనల్ మొదటి రోజు స్టాండ్స్ నుంచి వచ్చిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే మధ్య కోల్డ్ వార్ ముగిసిందని తెలిసే సంజ్ఞలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా సంతోషంలో మునిగిపోయారు.
గత కొంత కాలంగా రితికా, అనుష్కల మధ్య అంతా పరిస్థితి బాగోలేదనే వార్తలు వస్తున్నాయి. 2019 నుంచి రోహిత్ ఇన్‌స్టాలో కోహ్లీ, అనుష్కలను కూడా అన్‌ఫాలో చేశాడు. ఆ తర్వాత కోహ్లి, అనుష్క కూడా ఓ రహస్య సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. 4 సంవత్సరాల క్రితం రవిశాస్త్రి విలేకరుల సమావేశాన్ని వాయిదా వేయిడంతో రితికా, అనుష్కల గురించి కూడా ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఆ సమయంలో ఈ టాపిక్ ఎంతో హాట్‌గా మారిపోయింది.
ఇది మాత్రమే కాదు.. రితికా, అనుష్క ఇద్దరూ చాలా అరుదుగా కలిసి కనిపిస్తుంటారు. ఇద్దరూ స్టేడియంలో ఉంటారు. కానీ, ఇద్దరూ విడివిడిగా కూర్చోవడం కనిపిస్తుంది. రితికా తరచుగా తన ఫ్రెండ్స్‌తో కూర్చుంటుంది. సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోస్‌లో అనుష్క ఎప్పుడూ కనిపించలేదు.
చాలా కాలం తర్వాత ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అలాగే ఇద్దరూ చాలా క్లోజ్‌గా కనిపించారని, వీరిద్దరి మధ్య అంతా బాగానే ఉందని, కోల్డ్ వార్ ముగిసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వాలగానే.. విపరీతంగా వైరల్ అవుతోంది.
The cold war between Anushka Sharma and Ritika Sajdeh is on different level. The tension is mounting.
Rohit Sharma and Virat Kohli getting nervous seeing them sitting side by side.#WTCFinal #INDvsAUS pic.twitter.com/zNSwRfpSq8
— Pratham (@JainnSaab) June 7, 2023
ఇక ఫైనల్ గురించి మాట్లాడితే టాస్ గెలిచిన రోహిత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 33, ట్రావిస్ హెడ్ 60 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. హెడ్ తన కెరీర్‌లో 14వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Anushka Sharma in the stands at the Oval. pic.twitter.com/tbonM2aGB4
— Virat Kohli Fan Club (@Trend_VKohli) June 7, 2023
మార్నస్ లాబుషెన్ 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అతని కంటే ముందు డేవిడ్ వార్నర్ 43 పరుగుల వద్ద, ఉస్మాన్ ఖవాజా సున్నాతో ఔటయ్యారు. వార్నర్‌ను శార్దూల్, ఖవాజాను సిరాజ్ అవుట్ చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..