Cricket: ఓర్నీ.! ఏకంగా 12 రోజుల టెస్ట్ మ్యాచా.. ఏయే జట్లు ఆడాయో తెల్సా

టెస్ట్ మ్యాచ్ అంటేనే ఐదు రోజులు ఉంటుందని ఇప్పుడు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ టైం లెస్ టెస్ట్ మ్యాచ్ లు ఒకప్పుడు జరిగాయి. మరి అప్పుడు 12 రోజుల పాటు జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్ లో ఎవరెవరు ఆడారో తెలుసా.?

Cricket: ఓర్నీ.! ఏకంగా 12 రోజుల టెస్ట్ మ్యాచా.. ఏయే జట్లు ఆడాయో తెల్సా
Test Cricket

Updated on: Jan 09, 2026 | 1:07 PM

టెస్టు క్రికెట్ అంటేనే సాధారణంగా ఐదు రోజులు ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు కూడా ఆడారు. 1939లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ 12 రోజుల పాటు కొనసాగింది. టైమ్‌లెస్ టెస్ట్ విధానంలో భాగంగా జరిగిన ఈ సుదీర్ఘ పోరు.. బ్యాట్స్‌మెన్‌ల నిలకడైన ప్రదర్శన.. వర్షం అంతరాయాలతో సాగింది. చివరికి వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుంది. అయితే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ ఏకంగా పన్నెండు రోజుల పాటు కొనసాగిందంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. 1939వ సంవత్సరంలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ ఎక్కువ రోజులు జరిగిన రికార్డుగా ఇప్పటికీ టెస్ట్ చరిత్రలో నిలిచిపోతుంది. అప్పటికాలంలో టైమ్‌లెస్ టెస్ట్ మ్యాచ్‌లు అనే పద్ధతి ఉండేది. దీని ప్రకారం, మ్యాచ్‌కు ఎలాంటి రోజువారీ పరిమితి ఉండదు. ఒక జట్టు విజయం సాధించే వరకు ఆట కొనసాగుతుంది. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ఆట ఎక్కువ కాలం సాగింది. మధ్యలో రెండు రోజులు విశ్రాంతి కూడా తీసుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ల నిలకడైన ఆధిపత్యం, మధ్యమధ్యలో వర్షం అంతరాయాలు మ్యాచ్‌ను పన్నెండు రోజుల పాటు పొడిగించాయి. దురదృష్టవశాత్తు, చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో, ఈ సుదీర్ఘ చారిత్రాత్మక మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇది సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్‌గా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..