India vs Australia 2020: సిరాజ్ బౌలింగ్‌ను కొనియాడిన మాస్టర్ బ్లాస్టర్.. అద్భుతమైన బాల్స్ వేస్తున్నాడని కితాబు..

India vs Australia 2020: భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అద్భుతమని

India vs Australia 2020: సిరాజ్ బౌలింగ్‌ను కొనియాడిన మాస్టర్ బ్లాస్టర్.. అద్భుతమైన బాల్స్ వేస్తున్నాడని కితాబు..

Updated on: Jan 17, 2021 | 8:43 AM

India vs Australia 2020: భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అద్భుతమని ప్రశంసించాడు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరీతో నాలుగో టెస్ట్‌లో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సిరాజ్ బౌలింగ్‌ను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషిస్తూ అండగా నిలిచాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లతో సిరాజ్‌ స్వింగ్ రాబడుతున్నాడని వినిపిస్తున్న వాదనలను కొట్టిపారేశాడు. సిరాజ్ బౌలింగ్‌ని తాను పరిశీలించానని తెలివిగా, వైవిధ్యంగా బంతులు విసురుతున్నాడని అన్నాడు. బంతిపై ఉన్న షైన్‌ను ఉపయోగించుకుని ఫస్ట్ స్లిప్‌, సెకండ్‌ స్లిప్‌ లక్ష్యంగా బంతులు సంధిస్తున్నాడని తెలిపాడు. రెండు వేళ్లతో బంతుల్ని వదులుతూ స్వింగ్ రాబడుతున్నాడని, అలాగే కట్టర్‌ వేయాలనుకున్నప్పుడు బంతి షైన్‌ను ఎడమవైపునకు ఉండేలా ఉంచి, లేదా కోణాన్ని కాస్త మార్చి బంతులు వేస్తున్నాడని పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా సిరాజ్ నైపుణ్యమే అంటు ప్రశంసించాడు.

ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ…

India Vs Australia 2020: చివరిలో విఫలమైన భారత్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సూపర్ విక్టరీ..