ICC Player of the Month: జూన్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఉమెన్స్ క్రికెట్‌లో టీమిండియా యువ బ్యాటర్ షెఫాలీ వర్మతో పాటు ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ ఉమెన్స్ టీం నుంచి బౌలర్ సోఫీ ఎకిల్స్టోన్కూడా నామినేట్అయింది. ఇక మెన్స్ క్రికెట్‌లో కివీస్ ప్లేయర్లుడేవన్ కాన్వే, పేసర్కైల్ జేమీసన్తో పాటు దక్షిణాఫ్రికా సారథి క్వింటాన్ డికాక్‌లను ఈ అవార్డులకు ఐసీసీ నామినేట్ చేసింది. షెఫాలీ వర్మ టీ20 ఫార్మాట్లో ఆకట్టుకోవడంతో.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకోవడంతోపాటు ఏకైక టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకుంది. దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థ సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా నిలిచింది. అలాగే మొత్తంగా నాలుగవ మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియోట్ చేసింది.
ఇక, ఆల్‌రౌండర్ స్నేహ్రాణా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరకు ఇంగ్లండ్ టీంకు విజయాన్ని దూరం చేసింది. బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టింది. అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్బౌలర్సోఫీ ఎకిల్‌స్టోన్8 వికెట్లు పడగొట్టింది.
మూడు ఫార్మాట్లలో ఈ అవార్డులకు ప్లేయర్లను నామినేట్ చేసింది. ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఐసీసీ అవార్డులకు నామినేట్ చేసింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు ఆటగాళ్లు చూపిన ప్రతిభ, పనితీరును ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తుంది. అనంతరం ఓటింగ్‌కు ఉంచుతుంది. దీనిలో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ చేస్తారు. ఈ ఓటింగ్‌తో విజేతలను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు బ్రాడ్ కాస్టర్స్, సీనియర్ జర్నలిస్ట్‌లు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు ఉంటారు.
Also Read:
IND vs ENG: టీమిండియా ఆటగాళ్లకు రెండవ డోస్ వ్యాక్సిన్.. కోవిషీల్డ్ వేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు!