IND vs ENG: 26/11 ముంబై దాడుల టైంలో ఇంగ్లండ్ సహాయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి.. బీసీసీఐ అలా చేయడంపై గవాస్కర్ పొగడ్తలు

|

Sep 11, 2021 | 2:07 PM

Sunil Gavaskar: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచు రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ భారత శిబిరంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో మొదలుకాకుండానే ఆగిపోయింది.

IND vs ENG: 26/11 ముంబై దాడుల టైంలో ఇంగ్లండ్ సహాయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి.. బీసీసీఐ అలా చేయడంపై గవాస్కర్ పొగడ్తలు
Sunil Gavaskar
Follow us on

Sunil Gavaskar: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచు రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ భారత శిబిరంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో మొదలుకాకుండానే ఆగిపోయింది. అయితే, ఇంగ్లండ్ మీడియా మాత్రం బీసీసీఐని తప్పుబడుతూ పలు కథనాలు వెలువరించింది. అయితే, రద్దైన మ్యాచ్‌ను వచ్చే ఏడాది పర్యటనలో నిర్వహించేందుకు బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలను భారత దిగ్గజం, మాజీ సారథి సునీల్ గవాస్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. 2008లో ఇంగ్లండ్‌ టీం భారత పర్యటనకు వచ్చింది. అయితే ఆ సమయంలోనే భారత్‌లో 26/11 దాడులు జరిగాయని, అప్పుడా జట్టు చేసిన మేలును గుర్తించుకోవాలని కోరాడు.

2008 నవంబర్‌లో ఇంగ్లండ్ టీం ఏడు వన్డేల సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చింది. అయితే, నవంబర్‌ 26న ముంబయిలో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆరోజే కటక్‌లో టీమిండియా, ఇంగ్లండ్‌ టీంల మధ్య ఐదో వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి, 5-0 తేడాతో వన్డే సిరీస్‌ గెలుచుకుంది. అయితే, 26/11 దాడులతో భయపడిన ఇంగ్లండ్ మిగతా రెండు వన్డేలు ఆడకుండానే స్వదేశానికి వెళ్లింది. అయితే డిసెంబర్‌లో రెండు టెస్టుల సిరీస్‌ కోసం కెవిన్‌ పీటర్సన్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ టీం మరోసారి భారత పర్యటనకు వచ్చింది. దీంత బీసీసీఐకి నష్టం కలగకుండా సహాయం చేసింది. ఆనాటి విషయాన్ని భారత్‌ గుర్తుంచుకోవాలని గవాస్కర్ కోరారు.

‘ఐదో టెస్టును తిరిగి నిర్వహించాలని బీసీసీఐ ఆలోచించడం అభినందించాల్సిన విషయం. 2008లో ముంబయి 26/11 దాడుల సమయంలో ఏం జరిగిందో మర్చిపోకూడదు. భారత్‌లో భద్రత లేదని, టెస్టు సిరీస్‌ ఆడేందుకు మరోసారి రామని చెప్పే అవకాశం ఇంగ్లండ్‌కు ఉంది. పీటర్సన్‌ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటనకు వచ్చింది. పీటర్సన్ చొరవతోనే ఇంగ్లీష్ జట్టు భారత్‌ పర్యటనకు వచ్చింది. ఆ విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి. రద్దయిన మాంచెస్టర్ టెస్టును నిర్వహించడానికి బీసీసీఐ చేస్తోన్న ప్రయత్నాలు ఆహ్వానించదగినవి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: Hyderabad Football Club: హైదరాబాద్ యువకుడికి గోల్డెన్ ఛాన్స్.. హెచ్‌ఎఫ్‌సీలో దక్కిన చోటు

Neeraj Chopra: తన చిరకాల కోరిక తీర్చుకున్న నీరజ్ చోప్రా.. తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూసి పొంగిపోయాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?