IND vs ENG: ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయంతో బాధపడుతుండడంతో.. అసలు సిరీస్ కే దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాలి కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఆపరేషన్ చేయాల్సి అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈమేరకు గిల్ గాయం మరింత పెద్దది అయితే మాత్రం ఇంగ్లండ్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఒకవేళ్ గిల్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లయితే.. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు కూడా వార్తులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ లలో ఎవరో ఒకర్ని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ గిల్ ను ఫిటె నెస్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. శుభ్ మన్ గిల్ గాయంపై ఓ వార్త సంస్థ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, గిల్ గాయంపై మాకు సమచారం అందింది. అయితే, టెస్టు సిరీస్ కు మరోనెల సమయం ఉన్నందున, ఈ లోపు గిల్ కోలుకుంటాడని, ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం సిరీస్ నుంచి దూరమవుతాడని తెలిపాడు.
శుభ్ మన్ గిల్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. 31.84 సగటుతో 414 పరుగులు చేశాడు. దీంట్లో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు టెంట్ బ్రిడ్జ్ లో ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరస్ మొదలుకానుంది. టీమిండియా, ఇంగ్లండ్ సిరీస్ తోనే రెండవ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మొదలుకానుందని ఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓడిపోవడంతో.. పలు విమర్శల పాలైంది. దీంతో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో బలంగా పుంజుకుని విమర్శలకు తగిన సమాధానం ఇవ్వాలని చూస్తోంది. కానీ, గిల్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగలడంతో.. మరో ఓపెనర్ ఎలా ఆడతాడో నని ఆలోచనలో మేనేజ్ మెంట్ తీవ్ర తర్జన భర్జనలు పడుతోంది.
Also Read:
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ