IND vs ENG: దద్దరిల్లిన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్! తప్పు వాళ్లపై నెట్టేసిన గంభీర్?

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా 0-3 తేడాతో ఓటమిపాలైంది. నాలుగో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యాలపై గంభీర్ మండిపడ్డారు. జట్టు ఎంపికపై అభిమానులు గంభీర్‌ను విమర్శిస్తున్నారు, నాణ్యత లేని ఆటగాళ్లతో భారత పరువు తీస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

IND vs ENG: దద్దరిల్లిన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్! తప్పు వాళ్లపై నెట్టేసిన గంభీర్?
Gautam Gambhir

Updated on: Jul 10, 2026 | 3:34 PM

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఓడిన టీమిండియా సిరీస్ కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగతా మూడు మ్యాచ్‌ల్లో శ్రేయస్ సేన వరుస ఓటములను చవిచూసింది. దీంతో 0-3 తేడాతో ఇప్పటికే సిరీస్ ఓడిపోయింది. ఇక మిగిలి ఉన్న ఏకైక చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం 0-4తో ఓడించాలనే ఉత్సాహంతో ఉంది. అయితే నాలుగో మ్యాచ్ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాడీవేడి చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

బౌలర్లదే తప్పు..

మ్యాచ్ ముగిసిన వెంటనే టీమ్ మొత్తాన్ని ఒక చోటకు చేర్చి.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమ్ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ గంభీర్ ఆవేశంతో ఊగిపోయినట్లు, ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై విరుచుకుపడినట్లు సమాచారం. ఇందుకేనా మిమ్మల్ని టీమ్‌లోకి తీసుకుంది, అయినా ఇంత దారుణంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఏంటి? బౌలింగ్ మరీ ఫేలవంగా ఉందంటూ ఒక్కొక్కరిపై పాయింట్ అవుట్ చేసి తప్పులు ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. అలాగే కెప్టెన్ అయ్యర్ సైతం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ వైఫల్యంపై జట్టును కడిగిపారేసినట్లు సమాచారం.

గంభీర్‌పై విమర్శలు..

కాగా, బయట మాత్రం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తన ఒంటెద్దు పోకడతో జట్టులోకి క్వాలిటీ లేని ప్లేయర్లను తీసుకొచ్చి జట్టును నాశనం చేస్తున్నాడని చాలా మంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీపై కోపంతో ఆర్సీబీలో మంచి మంచి ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకోకుండా.. అంతా స్క్రాప్‌ను తీసుకొచ్చి.. అంతర్జాతీయ వేదికగాపై భారత్ పరువు తీస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us