ఫార్మాట్ ఏదైనా పరుగుల వర్షం కురిపించే టీమిండియా నయా సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ జనవరి నెలకు గానూ పురుషుల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. జనవరిలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గిల్ రికార్డులు బద్దలు కొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో సెంచరీల మీద సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల గిల్ జనవరిలో ఏకంగా మూడు సెంచరీలు కొట్టేశాడు. అంతేకాదు ఈ కాలంలో ఏకంగా 567 పరుగులు బాదేశాడు. ఇక హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 149 బంతుల్లో 28 బౌండరీల సహాయంతో 208 పరుగులు చేశాడు. తద్వారా వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం గిల్.. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, కివీస్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే నుంచి పోటీ ఎదుర్కొన్నాడు. అయితే ఐసీసీ గిల్ వైపే మొగ్గు చూపించింది.
మరోవైపు జనవరి నెలకు గాను మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ గ్రేస్ స్క్రీవెన్స్ కు లభించింది. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆమె భారీగా పరుగులు చేసింది. ఇప్పుడీ ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా గా స్క్రీవెన్స్ చరిత్ర సృష్టించింది. కాగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గిల్ చెలరేగాడు. కేవలం 63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా సచిన్ టెండూల్కర్, రోహిత్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లితో తర్వాత మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో టీమండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
Congratulations @ShubmanGill for winning the ICC Player of the Month award for January. The Indian opener has been in blazing form becoming the 5th India batter to score centuries in each of the three international formats ??#TeamIndia pic.twitter.com/7qll93xxzS
— BCCI (@BCCI) February 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..