టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు కొద్దిరోజుల క్రితం ప్రమాదానికి గురైంది. కొద్ది రోజుల పాటు డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం పంత్‌ను ముంబైకి తరలించారు. అక్కడి కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ డాక్టర్ దిన్‌షా పార్దీవాలా పంత్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా రిషబ్ హెల్త్ కండిషన్‌పై గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్లు లేవు. పంత్ ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్యం గురించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. లిగమెంట్ సర్జరీ చేయించుకున్న అనంతరం పంత్ మొదటిసారిగా మంచం మీద నుంచి లేచి కొన్ని నిమిషాల పాటు నిలబడ్డాడట. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం అతను తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం 4-6 నెలలు పడుతుందట. అదికూడా పంత్ మానసిక బలంపైనే ఆధారపడి ఉంటుందట.
డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. ఆ తర్వాత పంత్‌ను డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే పంత్‌కు ముంబైలోనే చికిత్స చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం జనవరి 4న పంత్‌ను విమానంలో ముంబైకి తరలించారు. ఆ తర్వాత డాక్టర్ దిన్‌షా పార్దీవాలా పర్యవేక్షణలో కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత పంత్ మోకాలికి లిగమెంట్ సర్జరీ జరిగింది. సుమారు 3 గంటల పాటు ఈ సర్జరీ కొనసాగింది. అయితే శస్త్రచికిత్స జరిగిన 4-5 రోజుల అనంతరం ఇతరుల సహాయంతో మంచం నుంచి పైకి లేచాడట పంత్. కొన్ని సెకన్ల పాటు తన కాళ్లపై తాను నిల్చున్నాడట. అయితే రాబోయే కొద్ది రోజుల పాటు వాకర్ సహాయంతో నడవాలని పంత్‌కు వైద్యులు సూచించారట. ఇక మరో వారం రోజుల పాటు పంత్‌ను ఆస్పత్రిలోనే ఉంచనున్నారట.
లిగమెంట్ సర్జరీ నుంచి పంత్ పూర్తిగా కోలుకోవడానికి 4-6 వారాలు పడుతుంది. దీని తర్వాత 2 నుండి 3 నెలల తర్వాత పంత్ కాలినడకన సాధన చేయవచ్చు. అయితే పూర్తిగా ఫిట్ అవ్వడానికి మరో 4 నెలలు పట్టవచ్చు. కాబట్టి పంత్ కనీసం 6 నెలలు మైదానానికి దూరంగా ఉండాలి. పట్టవచ్చు. ఈ సమయంలో అతను మానసికంగా దృఢంగా ఉండాలి. అప్పుడే త్వరగా కోలుకుంటాడు’ అని వైద్యులు తెలిపారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..