IND vs WI: ఇదేంది భయ్యా.. నమ్మి అవకాశం ఇస్తే.. నట్టేట ముంచేశావుగా.. ప్లేయింగ్ 11 నుంచి తప్పిస్తే బెటర్ అంటోన్న ఫ్యాన్స్..

|

Aug 09, 2023 | 3:17 PM

India vs West Indies: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఓ ఆటగాడికి అవకాశం ఇచ్చి పెద్ద తప్పు చేసింది. ఈ ఆటగాడు తన ఫ్లాప్ ప్రదర్శనతో మరోసారి అందరినీ నిరాశపరిచాడు. నాలుగో టీ20 మ్యాచ్ ఆగస్టు 12వ తేదీ శనివారం ఫ్లోరిడాలో జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెస్టిండీస్‌తో జరిగే నాల్గవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ను ప్లేయింగ్ XI నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది.

IND vs WI: ఇదేంది భయ్యా.. నమ్మి అవకాశం ఇస్తే.. నట్టేట ముంచేశావుగా.. ప్లేయింగ్ 11 నుంచి తప్పిస్తే బెటర్ అంటోన్న ఫ్యాన్స్..
Ind Vs Wi T20i
Follow us on

India vs West Indies: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఓ ఆటగాడికి అవకాశం ఇచ్చి భారత జట్టు మేనేజ్‌మెంట్ పెద్ద తప్పు చేసింది. ఈ ఆటగాడు తన ఫ్లాప్ ప్రదర్శనతో మరోసారి అందరినీ నిరాశపరిచాడు. ఈ ఆటగాడికి అవకాశం ఇవ్వడం ద్వారా భారత జట్టు మేనేజ్‌మెంట్ మరసారి విమర్శలపాలైంది. ఇప్పుడు చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ ఆటగాడు టీమ్ ఇండియా ప్లేయింగ్ XI నుంచి తప్పుకోవాలని కోరుకుంటున్నారు.

మేనేజ్‌మెంట్ చేసిన తప్పు..

లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. పరుగులను ఆపలేకపోవడం యుజ్వేంద్ర చాహల్‌లోని అతిపెద్ద బలహీనతగా మారింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో యుజ్వేంద్ర చాహల్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. యుజ్వేంద్ర చాహల్ కారణంగా, గత కొన్నేళ్లుగా మిగిలిన దేశాలతో పోల్చితే టీమ్ ఇండియా స్పిన్ విభాగం చాలా బలహీనంగా ఉందని నిరూపితమైంది.

ఇవి కూడా చదవండి

మరోసారి పేలవ ప్రదర్శన..

యుజ్వేంద్ర చాహల్ తన చివరి 8 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో కేవలం 8 వికెట్లు మాత్రమే సాధించాడు. ఇందులో 3 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో యుజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ సమయంలో యుజ్వేంద్ర చాహల్ భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆగస్టు 12వ తేదీ శనివారం ఫ్లోరిడాలో జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెస్టిండీస్‌తో జరిగే నాల్గవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ను ప్లేయింగ్ XI నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ను తప్పించడం ద్వారా కెప్టెన్ హార్దిక్ పాండ్యా రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఇరుజట్లు

వెస్టిండీస్ ప్లేయింగ్ 11: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

భారత్ ప్లేయింగ్ 11: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..