Duleep Trophy : ఆసియా కప్ వచ్చినా వీళ్లకి రిలాక్స్ ఉండదు.. కానీ మాకు మాత్రం ఒక్క ఛాన్స్ ఇవ్వరా అంటున్న స్టార్ ప్లేయర్లు

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అయితే, ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, టీమిండియాలోని కొంతమంది కీలక ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడబోతున్నారు. ఈ ట్రోఫీ ఆగస్టు 28న ప్రారంభమై సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది.

Duleep Trophy : ఆసియా కప్ వచ్చినా వీళ్లకి రిలాక్స్ ఉండదు.. కానీ మాకు మాత్రం ఒక్క ఛాన్స్ ఇవ్వరా అంటున్న స్టార్ ప్లేయర్లు
Team India Stars

Updated on: Aug 24, 2025 | 7:40 PM

Duleep Trophy : ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అయితే, అంతకు ముందు భారత ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో తమ సత్తా చాటనున్నారు. ఈ ట్రోఫీ ఆగస్టు 28న మొదలై సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇది నాకౌట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆసియా కప్ జట్టులోని కొంతమంది ప్లేయర్స్ కూడా ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్నారు.

దులీప్ ట్రోఫీలో ఎవరు ఆడనున్నారు?

ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు ఉన్నాయి: నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్. ఆసియా కప్ జట్టులోని కొంతమంది భారత ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్నారు. కులదీప్ యాదవ్ సెంట్రల్ జోన్ టీమ్‌లో ఆడనున్నాడు. ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా నార్త్ జోన్ తరపున ఆడతారు. తిలక్ వర్మ సౌత్ జోన్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

అలాగే, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు కూడా దులీప్ ట్రోఫీలో కనిపిస్తారు. వీరందరూ ఆసియా కప్‌ జట్టులో స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఉన్నారు. జైస్వాల్ వెస్ట్ జోన్ టీమ్‌లో, రియాన్ పరాగ్ ఈస్ట్ జోన్‌కు, ధ్రువ్ జురెల్ సెంట్రల్ జోన్‌కు కెప్టెన్‌గా ఆడనున్నారు.

దులీప్ ట్రోఫీ ఆగస్టు 28న ప్రారంభమవుతుంది. మొదటి క్వార్టర్ ఫైనల్ నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతుంది. రెండో క్వార్టర్ ఫైనల్ సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరుగుతుంది. గత ఎడిషన్‌లో ఫైనలిస్టులుగా ఉన్న సౌత్ జోన్, ఈస్ట్ జోన్ ఇప్పటికే సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

ఈ స్టార్ ఆటగాళ్లు కూడా

సెమీఫైనల్స్ సెప్టెంబర్ 4 నుండి 7 వరకు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. దులీప్ ట్రోఫీలోని అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరుగుతాయి. దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, ఆకాష్‌దీప్ వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..