భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ రోజుల్లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా, వన్డే క్రికెట్‌లో అతని గణాంకాలు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. వన్డే క్రికెట్‌లో భారత జట్టు ప్రధాన బౌలర్లలో ఒకడిగా మారిన సంగతి తెలిసిందే. 2022 నుంచి అతని గణాంకాలలో దూసుకపోతున్న సిరాజ్.. వన్డే క్రికెట్‌లో అత్యధిక డాట్ బాల్స్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు సిరాజ్ మొత్తం 606 డాట్ బాల్స్ విసిరాడు.
ఈ డాట్ బాల్స్ జాబితాలో సిరాజ్‌తో పాటు వెస్టిండీస్ బౌలర్ అకిల్ హుస్సేన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు మొత్తం 551 బంతులు విసిరాడు. ఇక అల్జారీ జోసెఫ్ ఈ విషయంలో మూడో స్థానంలో ఉన్నాడు. అప్పటి నుంచి వన్డేల్లో మొత్తం 534 డాట్ బాల్స్ వేశాడు.
అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్ పరంగా సిరాజ్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టాడు. కనీసం 150 ఓవర్ల తర్వాత బుమ్రా బౌలింగ్ సగటు 24.30గా ఉంది. ఈ విషయంలో 21.02 యావరేజ్‌తో సిరాజ్ నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు.
సిరాజ్ భారత జట్టు తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అతను 2017లో న్యూజిలాండ్‌పై భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. సిరాజ్ ఇప్పటివరకు 15 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30.39 సగటుతో 46 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 20 వన్డేల్లో 20.02 సగటుతో 37 వికెట్లు తీశాడు. 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 26.26 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20లో అతని ఎకానమీ 9.18గా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..