IND vs NZ: కివీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే.. తెలుగబ్బాయికి దక్కిన ఛాన్స్.. ఆ స్టార్ ప్లేయర్లు దూరం..

IND vs NZ Series: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. జనవరి 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs NZ: కివీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే.. తెలుగబ్బాయికి దక్కిన ఛాన్స్..  ఆ స్టార్ ప్లేయర్లు దూరం..
Team India

Updated on: Jan 14, 2023 | 6:31 AM

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియాను ప్రకటించింది. జనవరి 18 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ టీమిండియాలో భాగం కావడం లేదు. అతని స్థానంలో కేఎస్ భరత్‌కి అవకాశం దక్కింది. అదే సమయంలో, స్పిన్ ఆల్ రౌండర్ షహబాద్ అహ్మద్ కూడా ఈ సిరీస్‌లో ఎంపికయ్యాడు.

కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అందుబాటులో లేరు..

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఎంపిక కాలేదు. కుటుంబంలో జరిగే వేడుకలతో ఈ ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో లేరని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

కేఎస్ భరత్‌కి గోల్డెన్ ఛాన్స్..

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో ఆంధ్రా తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడే కేఎస్‌ భరత్‌కు అవకాశం దక్కింది. అయితే ఇషాన్ కిషన్ కూడా జట్టులోకి ఎంపికయ్యాడు.

ఇవి కూడా చదవండి

తిరిగొచ్చిన షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్, స్పిన్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ కూడా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి టీమిండియాకు తిరిగి వచ్చారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న షాబాజ్ అహ్మద్ భారత్ తరఫున మూడు వన్డేలు ఆడాడు. అయితే బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత షాబాజ్‌ను శ్రీలంక సిరీస్‌లో ఎంపిక చేయలేదు.

వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

వన్డే సిరీస్ షెడ్యూల్..

భారత్ vs న్యూజిలాండ్, 1వ వన్డే జనవరి 18 – హైదరాబాద్

భారత్ vs న్యూజిలాండ్, 2వ వన్డే జనవరి 21 – రాయ్‌పూర్

భారత్ vs న్యూజిలాండ్, 3వ వన్డే జనవరి 24 – రాంచీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..