Video: తొలుత జాతీయ గీతం.. ఆ తర్వాత మా తుజే సలాం.. గూస్ బమ్స్ తెప్పిస్తోన్న వీడియోలు చూశారా?

National Anthem in Victory Parade: ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు సన్మాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆటగాళ్లందరూ డబుల్ డెక్కర్ బస్సు పైకప్పుపై ప్రయాణించి నారిమన్ పాయింట్ మీదుగా వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. ఈ సమయంలో, క్రీడాకారులను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. కాగా, రాత్రి 9 గంటలకు ముందే టీమిండియా స్టేడియానికి చేరుకుంది. అనంతరం రాత్రి 9.05 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు.

Video: తొలుత జాతీయ గీతం.. ఆ తర్వాత మా తుజే సలాం.. గూస్ బమ్స్ తెప్పిస్తోన్న వీడియోలు చూశారా?
Team India Emotional Video

Updated on: Jul 05, 2024 | 8:25 AM

National Anthem in Victory Parade: ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు సన్మాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆటగాళ్లందరూ డబుల్ డెక్కర్ బస్సు పైకప్పుపై ప్రయాణించి నారిమన్ పాయింట్ మీదుగా వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. ఈ సమయంలో, క్రీడాకారులను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. కాగా, రాత్రి 9 గంటలకు ముందే టీమిండియా స్టేడియానికి చేరుకుంది. అనంతరం రాత్రి 9.05 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆటగాళ్లందరూ వరుసలో నిలబడి, స్టేడియంలో ఉన్న అభిమానులందరూ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కనిపించారు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూడాల్సిందే.

జాతీయ గీతం ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్టేడియంలో ఉన్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రపంచకప్ గెలవడం చాలా సంతోషంగా ఉందని, టోర్నీలో ప్రతి మ్యాచ్ గెలవడం నాకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు అద్భుతమైన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో డేవిడ్ మిల్లర్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా కెప్టెన్ అభివర్ణించాడు.

ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ సాంగ్‌తో గూస్ బమ్స్..

చివర్లో కప్‌తో టీమిండియా ఆటగాళ్లు మైదానంలో కలియతిరిగారు. ఈ సమయంలో ఏఆర్ రెహ్మాన్ పాడిన మా తుజే సలాం సాంగ్‌ను ప్లే చేశారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీతోపాటు హార్దిక్, రోహిత్, కుల్దీప్‌ ఇతర ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఆటగాళ్ల ఉత్సాహంతో అభిమానులు కూడా జతకలిశారు. దీంతో ఈ రెండు వీడియోలు చూస్తే నెటిజన్లకు కూడా గూస్ బమ్స్ వస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..