ఆసియా కప్ 2025పై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ! పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో..
2025 ఆసియా కప్‌లో భారత్ పాల్గొనకపోవడానికి బీసీసీఐ ఆలోచిస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఏసీసీ అధ్యక్షుడిగా ఉండటం ఇందుకు కారణాలు. భారత్ తప్పుకుంటే ఆసియా కప్‌కు స్పాన్సర్లు, డిమాండ్ తగ్గుతాయి. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఇరుకున పెడుతుంది.

ఈ ఏడాది ఆసియా కప్ మన దేశంలోనే జరగాల్సి ఉంది. ఆసియా కప్ అంటే ప్రధానంగా టీమిండియా, పాకిస్థాన్ మధ్యే పోటీ ఉంటుంది. ఈ రెండు టీమ్స్ ఆసియాలో స్ట్రాంగ్ టీమ్స్. అయితే ఇప్పుడు భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో.. బీసీసీఐ ఆసియా కప్ 2025పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ 2025కు దూరంగా ఉండాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి.. పాకిస్థాన్‌తో గొడవ అయితే.. వాళ్లను వద్దని మిగతా దేశాలతో టీమిండియా ఆడొచ్చు కదా అని అనుకోవచ్చు. అది నిజమే. కానీ, ప్రస్తుతం ఏసీసీ (ఏసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నఖ్వీ ఉన్నాడు. గతంలో ఏసీసీ ఛైర్మన్‌గా ఉన్న జై షా ఐసీసీ ఛైర్మన్‌గా వెళ్లడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది.
ప్రస్తుతం ఏసీసీ ఛైర్మన్‌గా నఖ్వీ కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ ఆధ్వర్యంలో జరగనున్న ఆసియా కప్ 2025లో భారత్ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పైగా ఆసియా కప్‌కు ఎక్కువగా భారత్ నుంచే స్పాన్సర్లు ఉంటారు. ఎందుకంటే టీమిండియా ఆడుతుంది కాబట్టి. ఈ ఆసియా కప్‌తో ఇండియా కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డులకే ఎక్కువ లాభం వస్తుంది. బీసీసీఐకి ఆసియా కప్ నుంచి వచ్చేది పెద్దగా ఏం ఉండదు. అందుకే టీమిండియా ఆసియా కప్ నుంచి తప్పుకుంటే.. ఆసియా కప్‌కు డిమాండ్ ఉండదు, స్పాన్సర్లు కూడా ఆసక్తి చూపించరు.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీకి ఆసియా కప్ నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే పీసీబీని ఇరుకున పెట్టేందుకు బీసీసీఐ ఆసియా కప్ 2025కు దూరంగా ఉండాలని భావిస్తోంది. మరి దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆసియా కప్‌లో ఇండియా, లేదా పాకిస్థాన్‌లో ఏదో ఒక దేశం మాత్రం కచ్చితంగా దూరం అయ్యే ఛాన్సులు మెండుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన దాడులు అందుకు కారణంగా నిలుస్తున్నాయి. మరి చూడాలి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. టీమిండియా ఆసియా కప్‌కు దూరం అయి.. ఒక వేళ పీసీబీ ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని అనుకున్న ఆ మ్యాచ్‌లో ఇండియాలో అయితే అస్సలు జరగవు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




