Team India Playing 11: ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆదివారం, సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సెప్టెంబరు 2న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ 2023 గ్రూప్ A మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏసీసీ ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న సూపర్-4 మ్యాచ్‌కు సెప్టెంబర్ 11వ తేదీని రిజర్వ్ డేగా ఉంచడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఆటగాడికి బెంచ్ మార్గాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. పాక్‌పై భారత్ ఏ ప్లేయింగ్ ఎలెవెన్‌తో బరిలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు రానున్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మొదటి 10 ఓవర్లలో పరుగులు కొల్లగొట్టడంలో పేరుగాంచారు. అంతకుముందు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (10)లు త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే, పాక్‌పై ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ చెలరేగాలని తహతహలాడుతున్నారు. కొలంబోలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ల భీకర ఫామ్‌ను పాకిస్థాన్ చూడొచ్చు.
పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నంబర్-3లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ నంబర్-4లో అవకాశం పొందవచ్చు. కేఎల్ రాహుల్ మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్ నంబర్-5లో ఫీల్డింగ్ చేయనున్నారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఎంపిక కావడం లేదు.
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్‌గా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు రానుండగా, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అవకాశం దక్కడం ఖాయం.
ఫాస్ట్ బౌలర్లలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించారు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడని ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తిరిగి రానున్నాడు. ఇలాంటి పరిస్థితిలో శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండటం అనుభవాన్ని ఇస్తుంది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ గురించి మాట్లాడితే, డెత్ ఓవర్లలో బలమైన బౌలర్లు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..