India vs Ireland: సిరీస్ గెలిచినా.. ఆ విషయంలో తలనొప్పిగానే ఉంది: జస్ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు..

|

Aug 21, 2023 | 7:04 AM

Jasprit Bumrah Statement On Playing 11: డబ్లిన్‌లోని మలాహిడ్‌లో ఆదివారం జరిగిన సిరీస్‌లోని రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో అజేయంగా ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ గెలిచినప్పటికీ ప్లేయింగ్-11పై కెప్టెన్ బుమ్రా కీలక ప్రకటన చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ముందు భారత్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆతిథ్య జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

India vs Ireland: సిరీస్ గెలిచినా.. ఆ విషయంలో తలనొప్పిగానే ఉంది: జస్ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు..
Ind Vs Ire
Follow us on

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు ఆదివారం అద్భుతాలు చేసింది. డబ్లిన్‌లో జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించి 3 టీ20ల సిరీస్‌లో 2-0తో అజేయంగా ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ముందు భారత్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆతిథ్య జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ గెలిచినప్పటికీ, కెప్టెన్ బుమ్రా ప్లేయింగ్-11పై కీలకంగా మాట్లాడాడు.

రితురాజ్, సంజు కీలక భాగస్వామ్యం..

మలాహిడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ టాస్ గెలిచి భారత్‌ను మొదట బ్యాటింగ్‌కు పంపాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 58 పరుగులు జోడించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ప్రసీద్ధ్ కృష్ణ, స్పిన్నర్ రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు.

కెప్టెన్ బుమ్రా ఏం చెప్పాడంటే?


మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు పిచ్ కాస్త పొడిగా ఉంది. వికెట్ స్లో అవుతుందని భావించి ముందుగా బ్యాటింగ్ చేశాం. ఇది చాలా ఆనందంగా ఉంది. ప్లేయింగ్-11ని ఎంచుకోవడం చాలా కష్టమైన పని. ఇది పెద్ద తలనొప్పి. అందరూ ఆసక్తిగా ఉన్నారు. అందరూ సత్తా చాటుతున్నారు. మనమందరం భారతదేశం కోసం ఆడాలని కోరుకుంటున్నాం. చివరికి ప్రతి ఒక్కరూ వారి స్వంత మార్గంలో పని చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

అంచనాలపై మాట్లాడిన కెప్టెన్..


పేసర్ బుమ్రా మాట్లాడుతూ, ‘అంచనాల భారంతో ఆడితే, ఒత్తిడికి గురవుతారు. ఆ అంచనాలను పక్కన పెట్టాలి. ఇన్ని అంచనాలతో ఆడుతున్నారంటే.. మీరు 100 శాతం న్యాయం చేయలేరు’ అని సూచించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..