Asia Cup 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇవ్వనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్..

|

Jun 15, 2023 | 9:23 PM

Jasprit Bumrah and Shreyas Iyer: గాయం కారణంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి గురించి ప్రస్తుతం ఓ శుభవార్త వచ్చింది. ఇది టీమ్ ఇండియాకు భారీ ఉపశమనం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Asia Cup 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇవ్వనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్..
Team India
Follow us on

ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్‌ తేదీలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)తో కలిసి గురువారం ప్రకటించింది. ఈ టోర్నీ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. అలాగే ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది. అయితే, ఆసియా కప్ షెడ్యూల్ వచ్చిన వెంటనే టీమిండియాకు కూడా శుభవార్త వచ్చింది. ప్రస్తుతం భారత జట్టు గాయాలతో ఇబ్బంది పడుతోంది. జస్ప్రీత్ బుమ్రా జట్టు ప్రధాన బౌలర్లలో ఒకడు. కానీ, గాయం కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయపడి మైదానానికి దూరంగా ఉన్నాడు. అయితే, వీరిద్దరి ఫిట్‌నెస్‌పై ప్రస్తుతం అభిమానులకు సంతోషం కలిగించేలా వార్తలు వస్తున్నాయి.

బుమ్రా వెన్నులో గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయంతో గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ బుమ్రా పాల్గొనలేకపోయాడు. ఐపీఎల్ 2023లోనూ ఆడలేకపోయాడు. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ కూడా వెన్ను గాయంతో బాధపడ్డాడు. అయ్యర్ కూడా ఈ గాయం కారణంగా IPL 2023 ఆడలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌తో తిరిగి మైదానంలోకి..

ESPNcricinfo వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, బుమ్రా, అయ్యర్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆసియా కప్‌తో తిరిగి మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. NCA వైద్య సిబ్బంది వారిద్దరిపై ఒక కన్నేసి ఉంచిందంట. ఈ ఇద్దరూ ఆసియా కప్‌ 2023తో పునరాగమనం చేస్తారని వైద్య సిబ్బంది చాలా సానుకూలంగా ఉన్నారంట. బుమ్రాకు న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స జరిగింది. మార్చిలో ఈ శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుంచి అతడు క్రికెట్ ఆడలేదు.

బుమ్రా ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. ఇటీవల అతను తేలికగా బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో అయ్యర్ గాయపడ్డాడు. అతనికి లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. ఈ సమయంలో ఫిజియోథెరపీ కూడా తీసుకుంటున్నాడు.

వన్డే ప్రపంచకప్‌పైనా దృష్టి..

ఆసియా కప్‌లో బుమ్రా, అయ్యర్ పునరాగమనం చేస్తే, అది టీమ్ ఇండియాకు గొప్ప వార్త అవుతుంది. ఎందుకంటే ఆసియా కప్ తర్వాత టీమ్ ఇండియా వన్డే ప్రపంచ కప్ ఆడాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా, అయ్యర్‌ల పాత్ర కీలకమైనది. ఇద్దరూ ఆసియా కప్‌లో ఆడితే, గాయం తర్వాత వారిద్దరూ లయలోకి వచ్చే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..