Team India: టీ20 జట్టులోకి కొత్త వికెట్ కీపర్.. ఫ్యూచర్ మాన్‌స్టర్‌కు నో ఛాన్స్.. జింబాబ్వే టూర్‌కి భారత జట్టు?

Indian Team Update For Zimbabwe T20I Series: టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత జట్టు వెంటనే జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ టూర్‌కు టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు వెళ్లరు. కేవలం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపవచ్చని తెలుస్తోంది. ఈ సమయంలో, భారత్‌కు ఇప్పటి వరకు ఆడే అవకాశం లభించని కొంతమంది ఆటగాళ్లకు కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ టూర్‌కి సంబంధించి వికెట్ కీపర్‌లకు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. నివేదికల ప్రకారం, జింబాబ్వే పర్యటనలో సంజు శాంసన్, ధృవ్ జురెల్‌లను వికెట్ కీపర్‌లుగా పంపనున్నారు.

Team India: టీ20 జట్టులోకి కొత్త వికెట్ కీపర్.. ఫ్యూచర్ మాన్‌స్టర్‌కు నో ఛాన్స్.. జింబాబ్వే టూర్‌కి భారత జట్టు?
Team India

Updated on: Jun 23, 2024 | 5:02 PM

Indian Team Update For Zimbabwe T20I Series: టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత జట్టు వెంటనే జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ టూర్‌కు టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు వెళ్లరు. కేవలం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపవచ్చని తెలుస్తోంది. ఈ సమయంలో, భారత్‌కు ఇప్పటి వరకు ఆడే అవకాశం లభించని కొంతమంది ఆటగాళ్లకు కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ టూర్‌కి సంబంధించి వికెట్ కీపర్‌లకు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. నివేదికల ప్రకారం, జింబాబ్వే పర్యటనలో సంజు శాంసన్, ధృవ్ జురెల్‌లను వికెట్ కీపర్‌లుగా పంపనున్నారు.

టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే జింబాబ్వేతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ టూర్‌లో యువ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. రిషబ్ పంత్ కూడా ఈ పర్యటనకు వెళ్లరు. ఈ కారణంగా ధృవ్ జురెల్ వికెట్ కీపర్‌గా టీమిండియాలోకి ప్రవేశించనున్నాడు. జురెల్ ఇంతకు ముందు భారత్ తరపున టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, పరిమిత ఓవర్లలో ఆడలేదు. ఇటువంటి పరిస్థితిలో, అతను జింబాబ్వే పర్యటనలో తన T20I అరంగేట్రం చేయగలడు. అతను కొన్ని IPL మ్యాచ్‌లలో బాగా ఆడాడు. అతని వికెట్ కీపింగ్‌పై ప్రశసంలు అందుకున్నాడు.

జింబాబ్వే పర్యటనకు వెళ్లే జట్టులో మయాంక్ యాదవ్‌కు నోఛాన్స్..

యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌ను ఈ టూర్‌కు పంపకపోవచ్చని మరో పెద్ద వార్త కూడా వస్తోంది. మయాంక్ యాదవ్ ఇతర ఆటగాళ్లతో పాటు NCA శిబిరంలో భాగమయ్యాడు. కానీ, అతను బహుశా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాకపోవచ్చని తెలుస్తోంది. IPL 2024 సమయంలో అతను తన పేస్‌తో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే, దీని తర్వాత అతను కూడా గాయానికి గురయ్యాడు. దీని కారణంగా అతను చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండవలసి వచ్చింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ళు టీ20 ప్రపంచ కప్ తర్వాత ODI, టెస్ట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. ఈ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సన్నద్ధమవుతారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..