IND vs AUS 4th T20I: టీ20 క్రికెట్‌లో మరో మైలురాయి చేరిన రుతురాజ్.. కేఎల్ రాహుల్ రికార్డ్ బ్రేక్..
Ruturaj Gaikwad: ఈ 116 ఇన్నింగ్స్‌లలో, రుతురాజ్ IPL, ఇతర దేశీయ టోర్నమెంట్ మ్యాచ్‌లలో 100 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, అతని ఇన్నింగ్స్‌లలో 16 అంతర్జాతీయ క్రికెట్‌లో వచ్చాయి. ఇప్పటి వరకు ఆడిన టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 5 సెంచరీలు చేశాడు. గత మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.

Ruturaj Gaikwad 4000 T20 Runs: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న రాయ్‌పూర్ టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులు చేయడం ద్వారా తన పేరిట పెద్ద రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు టీ20లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను కేవలం 116 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ సంఖ్యను తాకాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట నమోదైంది. కేఎల్ టీ20 క్రికెట్‌లో 117 ఇన్నింగ్స్‌ల్లో 4000 పరుగులు పూర్తి చేశాడు.
ఈ 116 ఇన్నింగ్స్‌లలో, రుతురాజ్ IPL, ఇతర దేశీయ టోర్నమెంట్ మ్యాచ్‌లలో 100 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, అతని ఇన్నింగ్స్‌లలో 16 అంతర్జాతీయ క్రికెట్‌లో వచ్చాయి. ఇప్పటి వరకు ఆడిన టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 5 సెంచరీలు చేశాడు. గత మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. T20 క్రికెట్‌లో రుతురాజ్ బ్యాటింగ్ సగటు 38+కాగా, స్ట్రైక్ రేట్ 139+లుగా నిలిచింది.
టీ20లో ఫాస్టెస్ట్ 4000 పరుగులు..
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన ఆటగాళ్లలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. యూనివర్స్ బాస్‌గా పేరుగాంచిన ఈ ఆటగాడు 109 మ్యాచ్‌లలో 107 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగులు చేశాడు. 2012లో ఈ రికార్డు సృష్టించాడు. 11 ఏళ్ల తర్వాత కూడా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. టీ20 క్రికెట్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ కూడా గిల్ కావడం విశేషం.
రుతురాజ్ గైక్వాడ్ అంతర్జాతీయ కెరీర్..
View this post on Instagram
రుతురాజ్ గైక్వాడ్ జులై 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతని కెరీర్ టీ20 మ్యాచ్‌లతో ప్రారంభమైంది. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో ఈ మ్యాచ్ జరిగింది. రెండున్నరేళ్ల స్వల్ప అంతర్జాతీయ కెరీర్‌లో గైక్వాడ్‌కు కేవలం 18 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. నిజానికి, అతను క్రమం తప్పకుండా ప్రదర్శన చేయలేకపోవడం, గాయం కారణంగా, అతను జట్టులో, వెలుపల కొనసాగుతూనే ఉన్నాడు.
ఇప్పటి వరకు అతని పేరు మీద 450+ T20 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. T20 ఇంటర్నేషనల్‌లో గైక్వాడ్ బ్యాటింగ్ సగటు 38+లుకాగా, స్ట్రైక్ రేట్ 144+గా నిలిచింది. గైక్వాడ్ వన్డేల్లో కూడా అరంగేట్రం చేశాడు. అతను 4 వన్డే మ్యాచ్‌లు ఆడి 106 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




