
Team India’s Full Schedule 2025: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. యుఎఇలో జరిగే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 28 వరకు కొనసాగే ఈ టోర్నమెంట్ తర్వాత, టీం ఇండియా టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతుంది. ప్రత్యేకత ఏమిటంటే అది కూడా స్వదేశంలోనే జరుగుతుంది.
ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.
ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత, టీం ఇండియా మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ వైట్-బాల్ సిరీస్‌లో, భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
భారత్ vs యుఏఈ – సెప్టెంబర్ 10 | బుధవారం
భారత్ vs పాకిస్తాన్ – సెప్టెంబర్ 14 | ఆదివారం
భారత్ vs ఒమన్ – సెప్టెంబర్ 19 | శుక్రవారం
B1 vs B2 – 20 సెప్టెంబర్ | శనివారం
A1 vs A2 – 21 సెప్టెంబర్ | ఆదివారం
A2 vs B1 – 23 సెప్టెంబర్ | మంగళవారం
A1 vs B2 – 24 సెప్టెంబర్ | బుధవారం
A2 vs B2 – 25 సెప్టెంబర్ | గురువారం
A1 vs B1 – 26 సెప్టెంబర్ | శుక్రవారం
( భారత జట్టు A1 లేదా A2 అవుతుంది )
అక్టోబర్ 2: మొదటి టెస్ట్ మ్యాచ్ – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
అక్టోబర్ 10: రెండవ టెస్ట్ మ్యాచ్ – అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
అక్టోబర్ 19: మొదటి వన్డే – పెర్త్ స్టేడియం, పెర్త్
అక్టోబర్ 23: రెండో వన్డే – అడిలైడ్ ఓవల్
అక్టోబర్ 25: మూడో వన్డే – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
అక్టోబర్ 29: మొదటి టీ20ఐ మ్యాచ్ – మనుకా ఓవల్, కాన్‌బెర్రా
అక్టోబర్ 31 : రెండవ టీ20ఐ మ్యాచ్ – మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్
నవంబర్ 2: మూడో టీ20ఐ మ్యాచ్ – బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
నవంబర్ 6: నాల్గవ టీ20ఐ మ్యాచ్ – గోల్డ్ కోస్ట్ స్టేడియం, కర్రారా
నవంబర్ 8: ఐదవ టీ20ఐ మ్యాచ్ – ది గబ్బా, బ్రిస్బేన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..