ICC World Cup 2023: హ్యాట్రిక్ విజయమే టార్గెట్.. ప్రపంచకప్‌లో భారత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు? ఎవరితోనంటే?

Team India Next Match in ICC World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్ అద్భుతమైన ఫామ్‌లో దూసుకపోతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందుకోసం టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ పూర్తయిన వెంటనే కీలక మ్యాచ్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇక రోహిత్ శర్మ జట్టు తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో, ఎక్కడ జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ICC World Cup 2023: హ్యాట్రిక్ విజయమే టార్గెట్.. ప్రపంచకప్‌లో భారత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు? ఎవరితోనంటే?
Ind Vs Pak Cwc 2023

Updated on: Oct 12, 2023 | 3:58 PM

ICC World Cup 2023 IND vs PAK: ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC world cup) టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ నాలుగు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం కోసం రోహిత్ శర్మ జట్టు తదుపరి మ్యాచ్ ఎప్పుడు? ఎవరితో? ఆడనుందో ఓసారి చూద్దాం..

ప్రపంచకప్‌లో భారత్‌కి తదుపరి ప్రత్యర్థి ఎవరు?

ప్రపంచకప్‌లో భారత్ తదుపరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది.

ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరుగుతుంది?

అక్టోబర్ 14 (శనివారం)న భారత్-పాక్ జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.

ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-పాక్‌ల మధ్య ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగనుంది.

ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానుంది.

భారతదేశం vs పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ ఓటీటీలో చూడాలి?

డిస్నీ + హాట్‌స్టార్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ ఛానల్లో చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్ కవరేజీని మీరు చూడొచ్చు.

రెండు జట్లు..

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ముహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ముహమ్మద్ నవాజ్, ముహమ్మద్ వసీం జూనియర్, అఘా సల్మాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఒసామా మీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..