న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ పర్యటనలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అందరి దృష్టిలో నిలిచాడు. మొత్తం పర్యటనలో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ టీ20 లేదా వన్డే సిరీస్‌లలో పరుగులు చేయడంలో ఓడిపోయాడు. మరోవైపు టీ20 సిరీస్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫాంలో కనిపించాడు. కానీ, వన్డే సిరీస్‌లో మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే తర్వాత సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “పంత్ ఆకర్షణీయమైన ఆటగాడు. చాలా స్వేచ్ఛగా ఆడినా న్యూజిలాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతను పరుగుల వర్షం కురిపించాల్సి ఉంది. కానీ, సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. పంత్ వైట్ బాల్ ఆటగాడు కాదు. అతను కేవలం రెడ్ బాల్‌లో మాత్రమే ఆడే ప్లేయర్” అని చెప్పుకొచ్చాడు.
బట్ మాట్లాడుతూ, “తన జీవితంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్న ఆటగాడి స్థానంలో భారత్ ఫామ్‌లో లేని బ్యాట్స్‌మన్‌ని ఆడిస్తుంది. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఎక్కువ ఓవర్లు ఆడాలి. అతను నంబర్ బ్యాట్స్‌మెన్, మీరు ఫామ్ లేని ఆటగాడి తర్వాత అతన్ని పంపుతున్నారు” అని కీలక వ్యాఖ్యలు చేశాడు.
“ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇది ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ప్రభావితం చేయవచ్చు. ఇక్కడ అలా జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ, తన జీవితంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడాలని కోరుకుంటాడు” అని పేర్కొన్నాడు.
టీ20 సిరీస్‌లో ఆడుతున్నప్పుడు రిషబ్ పంత్ 2 మ్యాచ్‌ల్లో కేవలం 8.50 సగటుతో 17 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో, 3 వన్డేల్లో 2 ఇన్నింగ్స్‌లలో, అతను 12.50 సగటుతో 25 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చాలా కాలంగా బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..