Australia vs India, 3rd Test: గబ్బా టెస్టులో భారత్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు ఇబ్బందుల్లో కూరుకపోయింది. స్కోర్ బోర్డులో 30 పరుగులు కూడా చేరకముందే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ వరకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ అజేయంగా నిలిచాడు.
3 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔటయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతను వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. మిచెల్ స్టార్క్ యశస్వి జైస్వాల్ (4 పరుగులు), శుభ్‌మన్ గిల్ (1 పరుగు)లను పెవిలియన్ చేర్చాడు.
ఆస్ట్రేలియా జట్టు ట్రావిస్ హెడ్ (152 పరుగులు), స్టీవ్ స్మిత్ (101 పరుగులు) సెంచరీల సాయంతో 445 పరుగులు చేసింది. తొలిరోజు వర్షం బీభత్సం సృష్టించింది. 90 ఓవర్లలో 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ చేస్తోంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచి పునరాగమనం చేసింది.
భారత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే, చాలా దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు.. పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. జైస్వాల్ 2 బంతులు ఆడి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, గిల్ 3 బంతుల్లో 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి వచ్చిన కోహ్లీ 16 బంతులు ఆడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు వినిపిస్తున్నాయి.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..