IND vs PAK: బ్యాడ్ న్యూస్ చెప్పిన కెప్టెన్ రోహిత్.. గాయపడిన కీలక ప్లేయర్.. ఆసియాకప్ నుంచి ఔట్..

Asia Cup 2023, Team India Playing 11: ఆసియా కప్ 2023 సూపర్-4 మూడో మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా టీమిండియా స్టార్ ప్లేయర్ ప్లేయింగ్ 11లో భాగం కాలేకపోయాడు. ఈ మేరకు రోహిత్ శర్మ బ్యాడ్ న్యూస్ చెప్పడంతో, మిగతా మ్యాచ్‌ల్లో ఆడతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, కేఎల్ రాహుల్ టీమిండియా ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇచ్చాడు.

IND vs PAK: బ్యాడ్ న్యూస్ చెప్పిన కెప్టెన్ రోహిత్.. గాయపడిన కీలక ప్లేయర్.. ఆసియాకప్ నుంచి ఔట్..
Team India Playing 11 Vs Pa

Updated on: Sep 10, 2023 | 3:36 PM

India vs Pakistan: ఆసియా కప్ 2023లో సూపర్-4 మూడో మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా టీమిండియా స్టార్ ప్లేయర్ ప్లేయింగ్ 11లో భాగం కాలేకపోయాడు.

బ్యాడ్ న్యూస్ చెప్పిన కెప్టెన్ రోహిత్..

పాకిస్థాన్‌పై శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను ప్లేయింగ్ 11లో చేర్చాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ ఇటీవలే జట్టులోకి వచ్చాడు. అయితే శ్రేయాస్ మరోసారి గాయపడ్డాడు.

శ్రేయాస్ అయ్యర్ కెరీర్..

తన కెరీర్‌లో ఇప్పటివరకు 44 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన 28 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్, సుమారు 6 నెలల పాటు క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో 44 మ్యాచ్‌లు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 1645 పరుగులు చేశాడు. ఇది కాకుండా టెస్టులో 10 మ్యాచ్‌లు ఆడుతూ 666 పరుగులు జోడించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఇంటర్నేషనల్‌లో, శ్రేయాస్ 49 మ్యాచ్‌ల్లో 7 అర్ధ సెంచరీలతో 1043 పరుగులు చేశాడు.

టీమిండియా ప్లేయింగ్ 11..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ ప్లేయింగ్ 11..

బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రఫ్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..