Team India new coach Rahul Dravid: రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ ఎవరనేదానిపై కొనసాగిన ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రావిడ్ అంగీకరించినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్‌తో చర్చలు జరిపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాధ్యులు.. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ ద్రావిడ్‌ను ఒప్పించారు. ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు, టీ20 వరల్డ్‌కప్‌తో ముగియనుంది. ఆ తర్వాత రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 వరల్డ్ కప్‌కు రాహుల్ కోచ్‌గా సారధ్యం వహించనున్నారు.
టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశముంది. అనంతరం 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్, ఆ పదవికి రాజీనామా సమర్పించి.. బాధ్యతలు చేపడతారని పేర్కొంటున్నారు. కాగా.. అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీ కాలం కూడా ముగియనుండడంతో అతని స్థానంలో భారత మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్‌సీఏలో రాహుల్ ద్రావిడ్‌తో పాటు పరాస్ మాంబ్రే బౌలింగ్ శిక్షకుడిగా సారధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే ఎన్‌సీఏలో తమ పదవులకు రాజీనామా సమర్పించనున్నారని బీసీసీఐ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్థానంలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ పదవిలో కొనసాగనన్నారు.
రవిశాస్త్రి తర్వాత భారత జట్టును విజయవంతంగా నడిపించే కోచ్ కోసం బీసీసీఐ రాహుల్ ద్రావిడ్‌ను నియమించుకుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు రాహుల్ ద్రావిడ్‌తో చర్చలు జరిపిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా.. కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పించారు.
Also Read: