MS Dhoni: ధోని కొత్త బైక్ చూశారా.. రూపురేఖలు మారిన యమహా ఆర్‌డీ 350..!

|

Nov 30, 2021 | 5:23 PM

Yamaha RD 350: ధోని కొనుగోలు చేసిన Yamaha RD 350, US స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా నిర్మించింది. ఇది భారతదేశంలో ఇదివరకు విక్రయించిన భారతీయ రాజ్‌దూత్ మోడల్‌కు భిన్నంగా ఉంటుంది.

MS Dhoni: ధోని కొత్త బైక్ చూశారా..  రూపురేఖలు మారిన యమహా ఆర్‌డీ 350..!
Ms Dhoni Yamaha Rd 350
Follow us on

MS Dhoni: క్రికెటర్ ఎంఎస్ ధోని వాహనాల ప్రియుడు. ద్విచక్ర వాహనాలే కాదు కార్లలోనూ ఎన్నో మోడల్స్‌‌ ధోనీ షెడ్‌లో చేరిపోతుంటాయి. పాత వాటి నుంచి కొత్త వాహనాలకు వరకు ఎన్నో తన మ్యూజియంలో చేర్చుకుంటాడు మన టీమిండియా మాజీ కెప్టెన్. అయితే తాజాగా మరో ద్వి చక్ర వాహనాన్ని తన చెంత చేర్చుకున్నాడు జార్ఖండ్ డైనమేట్. అదే Yamaha RD350 బైక్. అయితే ఈ బైక్‌ను ఎన్నో మార్పులు చేసి, తనకు కావాల్సిన స్పెషిఫికేషన్స్‌‌తో ధోని ఈ బైక్‌ను తయారుచేయించుకున్నాడు. ధోని కలలకు అనుగుణంగా తయారుచేసేందుకు ఏడాదిన్నర సమయం పట్టిందని సయ్యద్ జదీర్ తెలిపాడు. ఎట్టకేలకు యూఎస్ స్పెషిఫికేషన్‌కు అనుగుణంగా తయారుచేసి బైక్‌ను ధోనీకి అప్పగించాడట.

ధోని రెండు RD 350లను కొనుగోలు చేసినట్లు ఇంటర్నెట్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కేవలం ఒక్కటి మాత్రమే కొనుగోలు చేసినట్లు సయ్యద్ జదీర్ తెలిపాడు. కాంపిటీషన్ గ్రీన్‌ కలర్‌‌లో తయారుచేసి ధోనికి అందిచినట్లు ఆ‍యన తెలిపాడు. అలాగే గోల్డ్‌ కలర్‌తో RD 350ని కూడా తయారుచేసినట్లు సయ్యద్ తెలిపాడు.

ఈ బైక్ నిజానికి సయ్యద్ తీసుకున్న తన సొంత ప్రాజెక్ట్ అంట. అయితే ఈ మెడల్ నచ్చడంతో సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న ధోని.. సయ్యద్‌ను కలిసి కొన్ని మార్పులతో బైక్ రెడీ చేయాలని కోరాడంట. Yamaha RD 350 యూఎస్‌ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా నిర్మించారంట. ఇది ఇంతకుముందు భారతదేశంలో విక్రయించిన భారతీయ రాజ్‌దూత్ మోడల్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. ఇంజన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు సయ్యద్ తెలిపాడు. అలాగే మిగతా పార్ట్‌లను కూడా చాలా మార్పుల చేసి సరికొత్తగా దీనిని రూపొందించామని తెలిపాడు.

Also Read: