Video: నేను షాహిద్ అఫ్రిదిని కాదు భయ్యా.. సురేశ్ రైనాను.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న మిస్టర్ ఐపీఎల్.. వీడియో

|

Mar 17, 2023 | 11:46 AM

Suresh Raina: మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్‌లో పునరాగమనంపై ఆయన చేసిన ఆసక్తికర ప్రకటనే ఇందుకు కారణంగా నిలిచింది.

Video: నేను షాహిద్ అఫ్రిదిని కాదు భయ్యా.. సురేశ్ రైనాను.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న మిస్టర్ ఐపీఎల్.. వీడియో
Suresh Raina Viral
Follow us on

మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్‌లో పునరాగమనంపై ఆయన చేసిన ఆసక్తికర ప్రకటనే ఇందుకు కారణంగా నిలిచింది. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్న రైనాను ఐపీఎల్‌కు తిరిగి రావడంపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ నవ్వులు పూయించాడు. షాహిద్ అఫ్రిదిని కాదంటూ మాజీ భారత బ్యాట్స్‌మెన్స్ ప్రకటించాడు.

వరల్డ్ జెయింట్స్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రైనా.. ఈ మ్యాచ్ అనంతరం ఆసక్తికర సమాధానంతో సంచలనంగా మారాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత మహారాజా జట్టు ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

3 సిక్సర్లు, 2 ఫోర్లు.. 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్..

వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడమ చేతి వాటం రైనా కేవలం 1 పరుగు తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయాడు. అతను 41 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను గెలిపించలేకపోయింది. కానీ, ఐపిఎల్‌కు తిరిగి రావాలనే ప్రశ్నను లేవనెత్తింది.

నేను షాహిద్ అఫ్రిదిని కాదు..

లెజెండ్స్ లీగ్‌లో వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన 49 పరుగులతో రైనా ఇన్నింగ్స్ చూసిన తర్వాత, ఐపీఎల్‌కి తిరిగి వస్తారా అని విలేకర్లు ప్రశ్నలు గుప్పించారు. దీనిపై రైనా సరదాగా మాట్లాడుతూ, “నేను షాహిద్ అఫ్రిదిని కాదు. ఆయన రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చాడు. నేను అలా కాదు. నేను సురేష్ రైనాను అంటూ ప్రకటించాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

4 మ్యాచ్‌లలో 71 పరుగులు..

లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రస్తుత సీజన్‌లో, సురేష్ రైనా ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 71 పరుగులు చేశాడు. వరల్డ్ జెయింట్స్‌పై చేసిన 49 పరుగులే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. లీగ్‌లో రైనా సాధించిన సిక్సర్లు, ఫోర్ల సంఖ్య ఇప్పటి వరకు 7. అతను భారత మహారాజా తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..