Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్లుగా ఆ ఇద్దరే ఉండాలి: మాజీ ప్లేయర్

|

Aug 22, 2024 | 2:57 PM

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించనుంది. పాకిస్థాన్‌లో జరగనున్న ఈ టోర్నీ ముసాయిదా షెడ్యూల్‌ను విడుదల చేయగా, ఈ షెడ్యూల్ ప్రకారం లాహోర్‌లో టీమిండియా మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్లుగా ఆ ఇద్దరే ఉండాలి: మాజీ ప్లేయర్
Team India
Follow us on

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ టోర్నీలో టీమిండియాకు ఎవరు శుభారంభం ఇస్తారో దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే, వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. కాబట్టి, ఇక్కడ మంచి బ్యాటింగ్‌ కనబరిచే బ్యాట్స్‌మన్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగాలి.

అందుకే రోహిత్ శర్మతో కలిసి శుభమన్ గిల్ చాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించాలని దినేష్ కార్తీక్ అన్నాడు. ఇక్కడ, హిట్‌మ్యాన్ తుఫాన్ బ్యాటింగ్ ఆకట్టుకుంటే, మరోవైపు గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్‌తో దూసుకెళ్తుంటాడు. కాబట్టి ఈ జోడీని ఓపెనర్లుగా కొనసాగించడమే మంచిదన్న అభిప్రాయం డీకేలో ఉంది.

అదే సమయంలో యశస్వి జైస్వాల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేయాలని దినేష్ కార్తీక్ సూచించాడు. ఎందుకంటే, గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే జైస్వాల్‌ని రంగంలోకి దించడమే మేలు. యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటికే తన సత్తా చూపించాడు. అందుకే, తాను కూడా జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు క్రిక్‌బజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్ కార్తీక్ తెలిపాడు.

అదే సమయంలో టీమిండియా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, రాణించకపోతే భారత జట్టు భారీ స్కోరును కూడగట్టడంలో సందేహం లేదని దినేష్ కార్తీక్ అన్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్లుగా నిలిచారు. అలాగే, ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించినందున, అదే జట్టును ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయవచ్చు. ఇషాన్ కిషన్‌కు బదులుగా రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.

2023 వన్డే ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ థాక్ పట్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..