Breaking News: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

తాజాగా క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్..

Breaking News: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

Updated on: Mar 27, 2021 | 1:31 PM

Sachin Tendulkar Tests Corona Positive: దేశవ్యాప్తంగా కరోనా మహామ్మారి కోరలు చాస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అటు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో రాష్ట్రాలు కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

”కరోనా టెస్టు చేయించుకోగా.. నాకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కుటుంబంలో మిగిలిన వారికి నెగటివ్ తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు” అని సచిన్ ట్వీట్ చేశారు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

హైదరాబాద్‌లో హోళీ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలే.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

Loading...
Unable to load recommendations.
Follow Us