Hardik Pandya: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌కు కౌంటరిచ్చిన హార్దిక్ పాండ్యా.. ఇంతకీ ఏమన్నాడంటే.!

టీ20 ప్రపంచకప్ ఓటమితో టీమిండియా జట్టుపై మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌..

Hardik Pandya: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌కు కౌంటరిచ్చిన హార్దిక్ పాండ్యా.. ఇంతకీ ఏమన్నాడంటే.!
Hardik Pandya

Updated on: Nov 18, 2022 | 9:00 AM

టీ20 ప్రపంచకప్ ఓటమితో టీమిండియా జట్టుపై మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ చేసిన విమర్శలకు భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా దీటుగా స్పందించాడు. టీమిండియా తనను తాను నిరూపించుకునే అవసరం ఏమీ లేదన్నారు. ఆటతీరు సరిగా లేనప్పుడు ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.. వాటిని గౌరవిస్తామన్నారు. క్రీడల్లో బాగా రాణించేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని, అందాల్సిన ఫలితం అందుతుందని చెప్పాడు.

అయితే, పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నాడు. కాగా, ఆసియా కప్ లో ఓటమిని మరవక ముందే, టీ20 ప్రపంచ కప్ లోనూ టీమిండియా ఓడిపోయి తిరిగి వచ్చింది. న్యూజిలాండ్ తో టీమిండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆడకుండా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కు విశ్రాంతి ఇచ్చారు.