IND vs SA: టీంతోనే గౌహతి చేరినా, మ్యాచ్ ఆడని శుభ్మన్ గిల్.. కట్‌చేస్తే.. కెప్టెన్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ రీఎంట్రీ..?

Shubman Gill Ruled Out Of India vs South Africa 2nd Test: కోల్‌కతాలో జరిగిన భారత్ vs దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌కు దూరంగా ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, గౌహతిలో తప్పనిసరిగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌ నుంచి కూడా దూరంగా ఉన్నాడు. ఆయన ప్లేస్‌లో మరో యంగ్ ప్లేయర్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs SA: టీంతోనే గౌహతి చేరినా, మ్యాచ్ ఆడని శుభ్మన్ గిల్.. కట్‌చేస్తే.. కెప్టెన్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ రీఎంట్రీ..?
Shubman Gill

Updated on: Nov 20, 2025 | 7:02 AM

Shubman Gill Ruled Out Of India vs South Africa 2nd Test: కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్టులో మెడకు గాయమైన కారణంగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గౌహతిలో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా గిల్ మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం (నవంబర్ 22, 2025) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ సిరీస్ నిర్ణయాత్మకమైనది. గిల్ ఆడాలని కోరుకుని గౌహతికి చేరుకున్నా, గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

గిల్ స్థానంలో సాయి సుదర్శన్ గిల్ గైర్హాజరీలో, 24 ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ తుది జట్టులో (Playing XI) స్థానం దక్కించుకోనున్నాడు. సాయి సుదర్శన్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన ఆయన 30.33 సగటుతో 273 పరుగులు సాధించారు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టెస్టులో ఆయన 39, 87 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

గాయం తీవ్రత మొదటి టెస్టులో రెండో రోజున మెడకు గాయం కావడంతో గిల్ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ, ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ఆడటం వల్ల గాయం తిరగబెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు పడుతుందని, దీనివల్ల నవంబర్ 30న రాంచీలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు కూడా ఆయన దూరంగా ఉండే అవకాశం ఉందని సమాచారం.

మెడ గాయం కారణంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో పాల్గొనని గిల్.. నవంబర్ 22న దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు ముందు, మెడ బ్రేస్ ధరించకుండానే జట్టుతో కలిసి గౌహతి చేరుకున్నాడు. పీటీఐ ప్రకారం, గిల్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు పట్టవచ్చు. మ్యాచ్‌లకు సిద్ధంగా లేడని  తెలుస్తోంది. నవంబర్ 30న రాంచీలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చారు. వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకుంటుండగా.. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20ల కోసం తిరిగి రావొచ్చు అని తెలుస్తోంది. అలాగే వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మైదానంలో గాయం తర్వాత పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో, కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్‌లో వైస్ కెప్టెన్‌ పోటీదారుడిగా నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..