IND Vs SA: వన్డే క్రికెట్‌లో భారత బౌలింగ్‌ను ఈ ఫార్మాట్‌లోని బలహీన జట్లతో పోల్చాలి రావడం టీమిండియాకు చాలా దుర్ధినం లాంటింది. ఇది క్రికెట్, ఇక్కడ కొన్ని మ్యాచ్‌లు ఆటగాడిని లేదా జట్టును నేలపైకి విసిరేస్తాయనడంలో సందేహం లేదు. 2019 ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ప్రస్తుతం నిర్జీవమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టలేకపోతున్నారు. వారి బౌలింగ్‌లో వేగం ఉంది. వికెట్లు మాత్రం రావడం లేదు. బంతుల్లో టర్న్ ఉంది. కానీ, బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించలేకపోతున్నారు. అవును, ఈ కారణాల వల్లే ఈరోజు భారత బౌలింగ్ చాలా తక్కువ స్థాయిని తాకింది. టీమిండియాకు పోటీగా ఉన్న జట్ల బౌలర్లతో కాకుండా జింబాబ్వే, స్కాట్లాండ్ వంటి బలహీన జట్లతో సరిపోలడం దారుణంగా మారింది.
2019 ప్రపంచకప్‌కు ముందులాగే ఇప్పుడు వన్డేలు ఆడుతున్నారు. కానీ, మునుపటిలా పవర్‌ప్లేలలో మాత్రం వికెట్లు పడగొట్టలేకపోతున్నారు. పవర్‌ప్లేలో టీమ్ ఇండియా బౌలింగ్‌లో పస లేకుండా పోయింది. 2019 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ నుంచి దక్షిణాఫ్రికాకు భారత్ చేసిన అన్ని పర్యటనల్లోనూ వికెట్ల పరంగా ఆరంభంలో విజయాలు అందుకోకపోవడం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
2019 ప్రపంచకప్ తర్వాత భారత్ బౌలింగ్..
వన్డే క్రికెట్‌లోని తొలి పవర్‌ప్లే అంటే మొదటి 10 ఓవర్లలో 2019 ప్రపంచకప్ తర్వాత భారత బౌలింగ్‌ను పరిశీలిస్తే, పరిస్థితి చాలా నిరాశాజనకంగా కనిపిస్తుంది. జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ లేదా స్కాట్లాండ్ వంటి జట్ల మధ్య భారత్ నిలిచింది. ఈ గణాంకాలు ఎలా ఉన్నాయంటే..
2019 ప్రపంచకప్ తర్వాత ఆడిన మొదటి 10 ఓవర్లలో తక్కువ వికెట్లు తీసిన జట్లలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది మాత్రమే కాదు, భారతదేశ సగటు, ఎకానమీ రేటు కూడా అధ్వాన్నంగా ఉంది. 2019 ప్రపంచకప్ తర్వాత తొలి పవర్‌ప్లేలో భారత బౌలర్లు ఇప్పటివరకు 23 సార్లు బౌలింగ్ చేశారు. ఇందులో వీరు 5.74 ఎకానమీ, 132.10 సగటుతో 10 వికెట్లు మాత్రమే పడగొట్టారు.
భారత్ కంటే మెరుగ్గా జింబాబ్వే, స్కాట్లాండ్ టీంలు..
జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ లేదా స్కాట్లాండ్ బౌలింగ్ పరిస్థితి మొదటి పవర్‌ప్లేలో ఆకట్టుకుంది. ఇది భారతదేశం కంటే మెరుగ్గా కనిపిస్తుంది. జింబాబ్వే 2019 ప్రపంచ కప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లలో 4.65 ఎకానమీ, 63.45 సగటుతో 11 వికెట్లు తీశారు. ఆఫ్ఘనిస్తాన్ 7 ఇన్నింగ్స్‌లలో 4.40 ఎకానమీ, 28 సగటుతో 11 వికెట్లు పడగొట్టింది. మరోవైపు, స్కాటిష్ బౌలర్లు 11 ఇన్నింగ్స్‌లలో 4.41 ఎకానమీ, 40.50 సగటుతో 12 వికెట్లు తీయడం విశేషం.
IND vs SA, 3rd ODI: కేప్‌టౌన్‌కు చేరిన తుది సమరం.. క్లీన్‌స్వీప్ నుంచి భారత్ తప్పించుకునేనా?