IPL 2023: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత.. తొలి బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా యంగ్ ప్లేయర్..

Shubman Gil: ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున శుభ్‌మాన్ గిల్ ఆడుతున్నాడు. టోర్నీలో మే 15న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో గిల్ తన పేరిట చాలా ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు.

IPL 2023:  క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత.. తొలి బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా యంగ్ ప్లేయర్..
Shubman Gill

Updated on: May 17, 2023 | 3:46 PM

Shubman Gill Records: ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున శుభ్‌మాన్ గిల్ ఆడుతున్నాడు. టోర్నీలో మే 15న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో గిల్ తన పేరిట చాలా ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో అలా చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్ ఈ ఏడాది (2023) అంతర్జాతీయ, ఐపీఎల్‌తో కలిపి మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు.

తన పేరిట అద్భుత రికార్డ నమోదు..

నరేంద్ర మోదీ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా గిల్ నిలిచాడు.

జనవరి 15న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గిల్ 2023లో తొలి సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 116 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే జనవరి 18న, అతను న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఆ తర్వాత జనవరి 24న న్యూజిలాండ్‌పై మరో సెంచరీ సాధించాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లో తొలి సెంచరీ..

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడిన T20 సిరీస్‌లో, గిల్ తన మొదటి టీ20 అంతర్జాతీయ సెంచరీని (1 ఫిబ్రవరి) సాధించాడు. అతను 200 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేస్తూ 63 బంతుల్లో 126* పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ..

అదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఆడిన చివరి మ్యాచ్‌లో, అతను 128 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది . ఈ విధంగా గిల్ 2023లో ఐపీఎల్‌తో సహా మొత్తం 4 ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us