
Team India Playing 11 vs South Africa 1st T20I: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తుది జట్టు (ప్లేయింగ్ 11) ఎంపికపై కీలక సంకేతాలు ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు వింటే సంజు శాంసన్ అభిమానులకు నిరాశ కలగకమానదు.
తొలి టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. శుభ్‌మన్ గిల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. అయితే, తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే ఆలోచన లేదని పరోక్షంగా వెల్లడించాడు. “మేం ప్లేయింగ్ 11లో ఎక్కువ మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా రాబోయే రెండు సిరీస్‌లలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాం,” అని సూర్య పేర్కొన్నాడు.
గత మూడు టీ20 మ్యాచ్‌లలో సంజు శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతనికి కేవలం రెండు మ్యాచ్‌లలోనే అవకాశం దక్కింది. జితేష్ శర్మ ఫినిషర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. సూర్య వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే క్రమంలో సంజు శాంసన్‌ను మరోసారి పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నిజానికి సంజు శాంసన్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. 6 ఇన్నింగ్స్‌లలో 58.25 సగటుతో ఏకంగా 233 పరుగులు సాధించాడు. ఇందులో 11 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు ఉన్నాయి.
ఇంతటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టు కూర్పు కారణాల వల్ల అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడం నిజంగా దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లోనైనా సంజుకు ఎన్ని అవకాశాలు వస్తాయో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..