IPL 2024-28: వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వచ్చే ఐదేళ్లకు పొందడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 2500 కోట్లను బిడ్ చేసింది. టాటా గ్రూప్ గతంలో టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ఒక్కో సీజన్‌కు రూ.365 కోట్లు చెల్లిస్తోంది. అయితే, ఈసారి ఒక్కో సీజన్‌కు రూ.500 కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ బిడ్‌ను గెలుచుకునే దిశగా దూసుకుపోయింది.
టాటా గ్రూప్(TATA Group) మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వచ్చే ఐదేళ్లకు కొనుగోలు చేసింది. టాటా సన్స్ 2024 నుంచి 2028 వరకు IPL టైటిల్ స్పాన్సర్ (IPL Title Sponsor) కోసం సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అంటే, మొత్తం ఐదు ఐపీఎల్ ఎడిషన్ల టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల కోసం టాటా రూ.2500 కోట్లు వెచ్చించనుంది. ఈ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ గతేడాది డిసెంబర్ 12న టెండర్‌ను జారీ చేసింది. జనవరి 14న, టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను కొనుగోలు చేయడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 2500 కోట్లకు బిడ్ చేసింది. అయితే, రైట్ టు మ్యాచ్ కార్డ్ నిబంధన ప్రకారం టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను గెలుచుకోగలిగింది.
వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వచ్చే ఐదేళ్లకు పొందడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 2500 కోట్లను బిడ్ చేసింది. టాటా గ్రూప్ గతంలో టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ఒక్కో సీజన్‌కు రూ.365 కోట్లు చెల్లిస్తోంది. అయితే, ఈసారి ఒక్కో సీజన్‌కు రూ.500 కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ బిడ్‌ను గెలుచుకునే దిశగా దూసుకుపోయింది. కానీ, రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించి టాటా బిడ్‌ను గెలుచుకుంది.
IPL నియమాలలో రైట్ టు మ్యాచ్ కార్డ్ ఒకటి. ఈ నియమం ప్రకారం, మాజీ స్పాన్సర్ తన హక్కును దక్కించుకోవడానికి ఈ కార్డ్‌ని మళ్లీ ఉపయోగించవచ్చు. దీని ప్రకారం, 2022, 2023 కోసం IPL టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ మరోసారి బిడ్‌ను గెలుచుకుంది.
బీసీసీఐ సెక్రటరీ జయ్ షా మాట్లాడుతూ, ‘ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్‌తో మా భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. లీగ్ హద్దులు దాటి, నైపుణ్యం, అభిరుచి, వినోదం కలగలిసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తుంది. భారతదేశానికి చెందిన టాటా గ్రూప్ దేశంలోని వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసేందుకు చిహ్నంగా నిలిచింది. ఈ సహకారం వృద్ధికి, ఆవిష్కరణకు పరస్పర అనుసంధానానికి సంకేతంగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..